Pallavi Prashanth Arrested: బిగ్ బాస్ షో చరిత్రలో ఇది ఊహించని పరిణామం. టైటిల్ విన్నర్ జైలుపాలు అయ్యాడు. హైడ్రామా మధ్య రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు, అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17న ముగిసింది. ఆ రోజు అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. అమర్ దీప్ కారుపై దాడి జరిగింది. అద్దాలు పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేశారు.
అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. కొట్లాట జరిగింది. అంతటితో ఆగలేదు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలపైకి రాళ్లు రువ్వి డ్యామేజ్ చేశారు. ఇదంతా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేశారని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అన్నపూర్ణ స్టూడియో వెనుక గేట్ నుండి ఇంటికి పంపారు.
లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది. ఎలాంటి ర్యాలీలు చేయొద్దని సూచించారు. అయితే పోలీసుల సూచనలు ఖాతరు చేయకుండా పల్లవి ప్రశాంత్ మరలా ఓపెన్ టాప్ కారులో అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు. సీరియస్ అయిన పోలీసులు మందలించారు. అలాగే పలు సెక్షన్స్ క్రింద కేసులు పెట్టారు. నిన్న పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం నేను ఎక్కడికీ పోలేదు. ఇంటి దగ్గరే ఉన్నానని పల్లవి ప్రశాంత్ వీడియో రిలీజ్ చేశాడు.
రాత్రి పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అతని స్వగ్రామానికి వెళ్లారు. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడుని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. పల్లవి ప్రశాంత్ ని కోర్టులో హాజరు పరిచిన నేపథ్యంలో అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. పల్లవి ప్రశాంత్ ని చంచల్ గూడ జైలుకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ జైలుపాలు కావడం ఇదే మొదటిసారి.
పల్లవి ప్రశాంత్‌ను చంచల్ గూడ జైలుకు తరలింపు
అన్నపూర్ణ స్టూడియో వద్ద విధ్వంసం కేసులో బిగ్ బాస్ – 7 విజేత పల్లవి ప్రశాంత్ మరియు అతని తమ్ముడు రాజును అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. pic.twitter.com/xClqECjrpb
— Telugu Scribe (@TeluguScribe) December 21, 2023