https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ షోని రిజెక్ట్ చేసిన సెలెబ్రిటీలు వీరే! కారణం ఏంటంటే?

మానసికంగా,శారీకంగా దృఢంగా ఉన్నవాళ్లే ముందుకు వెళతారు. అయిన వాళ్ళను, స్నేహితులను వదిలేసి నాలుగు గోడల మధ్య జీవితం పరీక్షలు పెడుతుంది. అయినా బిగ్ బాస్ ఛాన్స్ అంటే ఎగిరి గంతేస్తారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 3, 2023 / 10:45 AM IST

    biggboss - 7

    Follow us on

    Bigg Boss 7 Telugu : చాలా మంది సెలెబ్స్ బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు ఇష్టపడతారు. కారణం ఈ షో ద్వారా జనాలకు మరింత దగ్గర కావచ్చని భావిస్తారు. అత్యంత ఆదరణ కలిగిన షో కావడంతో భారీ ఫేమ్ సొంతం చేసుకోవచ్చు. అది కెరీర్లో ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. మంచి గేమ్ తో పాటు కాలం కలిసొస్తే టైటిల్ కూడా పట్టేయొచ్చు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రూ. 50 లక్షల నగదుతో పాటు విలువైన బహుమతులు సొంతం చేసుకుంటాడు. అందుకే బిగ్ బాస్ షోకి అంత క్రేజ్. అదే సమయంలో బిగ్ బాస్ హౌస్లో ఉండటం అంత సులభం కాదు.

    మానసికంగా,శారీకంగా దృఢంగా ఉన్నవాళ్లే ముందుకు వెళతారు. అయిన వాళ్ళను, స్నేహితులను వదిలేసి నాలుగు గోడల మధ్య జీవితం పరీక్షలు పెడుతుంది. అయినా బిగ్ బాస్ ఛాన్స్ అంటే ఎగిరి గంతేస్తారు. అయితే కొందరికి ఛాన్స్ వచ్చినా వదిలేశారు. కొందరు అనుకోని సంఘటనలతో షోకి వెళ్ళలేదు. కొందరేమో బేరం కుదరక వెళ్ళలేదు.

    జబర్దస్త్ కమెడియన్, నటుడు మహేష్ ఆచంట, మొగలిరేకులు ఫేమ్ సాగర్ లకు ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేశారట. యువ సామ్రాట్, యూట్యూబర్ అనిల్ గీలాలకు చివరి నిమిషంలో ఛాన్స్ చేజారినట్లు సమాచారం. ఎంపికయ్యాక చివర్లో తనకు హ్యాండ్ ఇచ్చారని అనిల్ బాధపడ్డాడు. ఇక జబర్దస్త్ నరేష్ సైతం ఈ సీజన్లో పాల్గొనాల్సి ఉంది. జబర్దస్త్ షో అగ్రిమెంట్ బ్రేక్ చేసి షోకి వెళ్లేందుకు అతడు ఆసక్తి చూపలేదట. అలాగే ఆస్ట్రేలియాలో ఓ షో చేయాల్సి ఉండగా అది కూడా బిగ్ బాస్ షోను రిజెక్ట్ చేయడానికి కారణం అంటున్నారు.

    సీరియల్ నటి పూజా మూర్తి చివరి క్షణంలో తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె తండ్రి హఠాన్మరణం పొందాడు. దీంతో పూజా మూర్తి ఛాన్స్ వదులుకుంది. మరో సెలెబ్ అంజలి పవన్ రెమ్యూనరేషన్ కారణంగా చివర్లో షో నుండి తప్పుకుందట. ఇలా పలువురు ఛాన్స్ వచ్చినా పలు కారణాలతో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే ఛాన్స్ వదిలేశారట. నేడు సీజన్ 7 ఘనంగా స్టార్ట్ అవుతుంది. నాగార్జున హోస్ట్ గా భారీగా లాంచింగ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.