Bigg Boss Telugu 7 Contestants : టోటల్ లిస్ట్ లీక్… నేడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది వీళ్ళే!

అలాగే ఆట సందీప్, సింగర్ దామినీ, యాంకర్ ప్రత్యూష, రితిక నాయక్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. మరికొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

Written By: NARESH, Updated On : September 3, 2023 9:00 am

Bigg Boss Telugu 7 Contestants-

Follow us on

Bigg Boss Telugu 7 Contestants : మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ గా లాంచ్ కానుంది. నాగార్జున సారథ్యంలో నయా సీజన్ సరికొత్తగా సిద్ధమైంది. ఈసారి చివరి వరకు కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో సందిగ్ధత నడిచింది. కొందరు చివరి నిమిషంలో తప్పుకోగా మరికొందరు యాడ్ అయ్యారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ మేకర్స్ గోప్యంగా ఉంచుతారు. ఈసారి హౌస్లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరో ఆడియన్స్ కేవలం లాంచింగ్ ఈవెంట్లో తెలుసుకునేలా ప్లాన్ చేస్తారు.

అయితే వివిధ కారణాలతో అది బయటకు వచ్చేస్తుంది. బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా దాదాపు బయటకు వచ్చేసింది. ఈ సీజన్ కంటెస్టెంట్స్ నేమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారిలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం… జానకి కలగనలేదు ఫేమ్ అమర్ దీప్ చౌదరి ఫైనల్ అయ్యాడు. ఆయన హౌస్లోకి వెళ్లడం ఖాయమే. కార్తీకదీపం సీరియల్ విలన్ గా శోభా శెట్టి బుల్లితెర ఆడియన్స్ లో ఫేమ్ తెచ్చుకుంది. ఈమె కూడా ఈ సీజన్ కి ఎంపికయ్యారు.

మరికొందరు సీరియల్ నటులు ప్రియాంక జైన్, శుభశ్రీ, ఐశ్వర్య ప్రిన్సే ఈ లిస్ట్ లో ఉన్నారట. అలాగే మోడల్ ప్రిన్స్ యువర్ ఎంపికయ్యాడట. అనూహ్యంగా నటుడు శివాజీ పేరు తెరపైకి వచ్చింది. ఆయన బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తున్నాడట. అలాగే సీమశాస్త్రి మూవీ ఫేమ్ ఫర్జానా, ఒకప్పటి శృంగార తార షకీలా హౌస్లో అడుగుపెట్టబోతున్నారట. జబర్దస్త్ నటుడు యూట్యూబర్ అయిన తేజ, వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావలి, రైతుబిడ్డ ఫేమ్ పల్లవి ప్రశాంత్ ఎంపికయ్యారట.

అలాగే ఆట సందీప్, సింగర్ దామినీ, యాంకర్ ప్రత్యూష, రితిక నాయక్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. మరికొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. దాదాపు లిస్ట్ ఇదే అనే ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్ 3 అనగా నేడు సాయంత్రం బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ గా ప్రారంభం కానుంది. కొన్ని గంటల్లో ఈ లిస్ట్ పై పూర్తి అవగాహన రానుంది.