Bigg Boss 7 Telugu : ఎలిమినేషన్ కి వేళాయెరా… ఆ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్ అని చెప్పిన నాగార్జున!

అయితే వీకెండ్స్ లో అలా జరిగితే కంటెంట్ ముందే తెలిసిపోతుందని భావించి బిగ్ బాస్ టీం వీకెండ్స్ OTT టెలికాస్ట్ ఆపేసింది.

Written By: NARESH, Updated On : September 10, 2023 3:40 pm
Follow us on

Bigg Boss 7 Telugu : తెలుగు బుల్లితెర మీద సూపర్ సక్సెస్ అయిన షో బిగ్ బాస్. తెలుగు లో ఇలాంటి కంటెంట్ ను ఆదరిస్తారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ దూసుకెళ్తుంది ఈ షో. తాజాగా సీజన్ 7 కూడా స్టార్ట్ అయ్యి మొదటి వారం పూర్తి చేసుకోబోతోంది. గత సీజన్ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఎలాగైనా ఈ సీజన్ ను హిట్ చేయాలనీ బిగ్ బాస్ టీం గట్టిగా ఫోకస్ చేసింది. దానికి తగ్గట్లే అనేక మార్పులు చేర్పులు చేశారు.

ఇక బిగ్ బాస్ హౌస్ అంటేనే వారం వారం ఎలిమినేషన్స్ ఉంటాయి. గత సీజన్స్ లో కొన్నిసార్లు మొదటి వారం కాబట్టి ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా జరిగేది. కానీ ఈ సీజన్ లో మాత్రం మొదటివారం ఎలిమినేషన్ ఖాయమనే తెలుస్తుంది. ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. అందులో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా నాగార్జున సేవ్ చేసుకుంటూ వచ్చాడు. ఇక చివరికి ప్రిన్స్ యావర్ , కిరణ్ రాథోడ్ లు మాత్రమే మిగిలారు. కాబట్టి ఎలిమినేషన్ ఖచ్చితంగా వీళ్ళలోనే ఉంటుందనేది కంఫర్మ్.

అయితే ఇప్పటికే హౌస్ నుంచి వాళ్ళ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్ ను కూడా శనివారమే షూట్ చేశారని అందులో భాగంగా కిరణ్ రాథోడ్ ని ఎలిమినేట్ చేశారని తెలుస్తుంది. నిజానికి హౌస్ లో తెలుగు రాక తాను ఇబ్బంది పడటమే కాకుండా అందరిని ఇబ్బంది పెడుతుంది రాథోడ్. కొంచెం కిచెన్ లో వంట చేయడం తప్ప పెద్దగా ఆమె చేసింది ఏమి లేదు.

అటు టాస్క్ లు కావచ్చు, ఇటు ఎంటర్టైన్మెంట్ కావచ్చు కిరణ్ రాథోడ్ పాత్ర ఏమీ లేదు. దీన్ని చూపిస్తూ కూడా మిగిలిన హౌస్ మెంబర్స్ ఆమెను నామినేట్ చేశారు. దీనితో మొదటివారమే హౌస్ నుంచి వెళ్ళిపోయింది కిరణ్ రాథోడ్ అని వార్తలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ టీం కూడా సరికొత్త నిర్ణయం తీసుకుంది. హాట్ స్టార్ లో బిగ్ బాస్ 24/7 టెలికాస్ట్ అవుతుంది. అయితే వీకెండ్స్ లో అలా జరిగితే కంటెంట్ ముందే తెలిసిపోతుందని భావించి బిగ్ బాస్ టీం వీకెండ్స్ OTT టెలికాస్ట్ ఆపేసింది. ఆదివారం రాత్రి 10. 30 తర్వాత యధావిధిగా OTT లో 24 / 7 ని కొనసాగిస్తుంది.