https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : ఫినాలే రేస్ లో ఊహించని మలుపు… గేమ్ ఛేంజర్ గా ప్రియాంక!

కాగా ఫినాలే రేస్ లో భాగంగా ఇప్పటి వరకు తొమ్మిది టాస్క్ లు బిగ్ బాస్ నిర్వహించాడు. ఇక ఇది ముగింపు దశకు చేరుకోగా .. రేస్ లో కొనసాగుతున్న గౌతమ్ స్కోర్ బోర్డు లో లీస్ట్ లో ఉన్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2023 / 09:16 PM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే అస్త్ర రేస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే శివాజీ,శోభా, ప్రియాంక, యావర్ లు రేస్ నుంచి తప్పుకున్నారు. అయితే బిగ్ బాస్ ఆదేశం ప్రకారం వాళ్ళు సాధించిన పాయింట్లలో కొంత భాగం వాళ్లకు ఇష్టమైన వారికి ఇచ్చారు. కాగా ఫినాలే రేస్ లో భాగంగా ఇప్పటి వరకు తొమ్మిది టాస్క్ లు బిగ్ బాస్ నిర్వహించాడు. ఇక ఇది ముగింపు దశకు చేరుకోగా .. రేస్ లో కొనసాగుతున్న గౌతమ్ స్కోర్ బోర్డు లో లీస్ట్ లో ఉన్నాడు.

    దీంతో రేస్ నుంచి తప్పుకున్నాడు. కాగా గౌతమ్ సాధించిన పాయింట్లలో 140 పాయింట్లు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. దీంతో ప్రియాంక, గౌతమ్ లు.. అర్జున్ ని రిక్వెస్ట్ చేశారు. ప్రియాంక కోరిక ప్రకారం .. అమర్ కి పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నాను అని అర్జున్ ని అడిగాడు గౌతమ్. సరే నీ ఇష్టం అని అర్జున్ అన్నాడు. నిజానికి గౌతమ్ పాయింట్లు తనకే ఇస్తాడని ధీమాతో ఉన్నాడు అర్జున్.

    కానీ ప్రియాంక తన పాయింట్లు గౌతమ్ కి ఇచ్చింది. దీంతో అమర్ నానా మాటలు అన్నాడు. అందుకే ప్రియాంక ..గౌతమ్ దగ్గర మాట తీసుకుని పాయింట్లు అమర్ కి ఇప్పించింది. ఇచ్చిన మాట ప్రకారం అమర్ కి పాయింట్లు ఇస్తూ .. ‘ ఇవి ప్రియాంక పాయింట్లు .. ఇంకోసారి ఇవ్వలేదని అనకు’ అని గౌతమ్ అన్నాడు. దీంతో శోభా ‘ ఇస్తున్నావ్ అని చెప్పు .. ఇంకోసారి ఏమి అనొద్దు అనడం కరెక్ట్ కాదు’ అని గౌతమ్ తో అంది.

    అయితే అర్జున్ కాస్త నిరాశపడుతూ సోఫాలో కూర్చున్నాడు. దీంతో శివాజీ ‘ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా ‘ అంటూ పాట పాడాడు. గౌతమ్ తో అమర్ కి పాయింట్లు ఇప్పించి .. అమర్ నోరు మూయించింది ప్రియాంక. ఆటను మలుపు తిప్పి గేమ్ ఛేంజర్ గా మారింది ప్రియాంక.