https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్.. అన్యాయం అయిపోయిన శివాజీ

బిగ్ బస్ హిస్టరీలోనే తొలిసారి ఒక సామాన్యుడు.. ఒక రైతు బిడ్డ విజేతగా నిలిచాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2023 / 10:30 PM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచారు. ఫైనల్ లో టాప్ 3గా పల్లవి ప్రశాంత్, అమర్, శివాజీ నిలిచారు. నిజానికి ఈ షో విన్నర్ గా శివాజీ నిలుస్తాడని.. అతడి పెద్దరికం.. చాణక్యానికి అతడే విజేత అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ చివరి వారం ఓటింగ్ కు వచ్చేసరికి మాత్రం అంతా తారుమారైంది.

    బిగ్ బస్ హిస్టరీలోనే తొలిసారి ఒక సామాన్యుడు.. ఒక రైతు బిడ్డ విజేతగా నిలిచాడు. నిజానికి ఇలా నిలిపింది కేవలం నటుడు శివాజీనే. తొలి వారం నుంచే ఎవరూ మాట్లాడకుండా సామాన్యుడిలా ఉన్న పల్లవి ప్రశాంత్ ను వెనకేసుకొచ్చి అతడిని సానబట్టి ఫైనల్ వరకూ తీసుకొచ్చి విజేతగా నిలిపింది శివాజీ.

    అందుకే శివాజీ 3వ టాప్ 3గా ఎలిమినేట్ అయ్యాక అతడి కొడుకు స్టేజీపైనే ఏడ్చేశాడు. విజేత కావాల్సిన శివాజీ ఓడిపోవడానికి కారణం పల్లవి ప్రశాంత్ నే. ప్రశాంత్ ను పైకి లేపి శివాజీ అన్యాయమైపోయాడు.. రైతుబిడ్డగా అందరి మనసులు చూరగొని ప్రశాంత్ విజేతగా నిలిచాడు.

    ఇక అమర్ ను టార్గెట్ చేసి శివాజీ, పల్లవి ప్రశాంత్ ఏడిపించారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ కు, అమర్ కు అస్సలు పడలేదు. అమర్ ను ఏడిపించడమే అతడిని టప్ 2 ఫైనలిస్ట్ గా మార్చింది. టీవీ ఆర్టిస్టులు, టాలీవుడ్ నుంచి అమర్ కు అత్యధికంగా ఓట్లు పడడంతో అమర్ టాప్ 2గా నిలిచారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విజేతగా చివరకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచి గ్రాండ్ గా టైటిల్ గెలుచుకున్నాడు.

    నిజానికి బయట అన్నీ పోల్స్ లోనూ టాప్ 1గా పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. టాప్ 2గా శివాజీ ఉన్నాడు. అమర్ 3వ స్థానంలో ఉన్నాడు. కానీ బిగ్ బాస్ మాత్రం టాప్ 2గా పల్లవి ప్రశాంత్, అమర్ ను పెట్టి శివాజీని మూడో ఎలిమినేటర్ గా మార్చేశారు. ఇక్కడే శివాజీ ఫ్యాన్స్ తోపాటు ఆయన కుమారుడు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేయలేదని అంటున్నారు. శివాజీకి అన్యాయం జరిగిందని అంటున్నారు.