https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : ఎపిసోడ్ హైలెట్స్… సీరియల్ బ్యాచ్ కి గడ్డి పెట్టిన నాగ్, రతిక వలలో పడొద్దని యావర్ కి ఇండైరెక్ట్ వార్నింగ్!

ముఖ్యంగా యావర్,శోభా మధ్య జరిగిన గొడవ హైలెట్ గా నిలిచింది.యావర్ కెప్టెన్సీ రేస్ నుంచి శోభ ను తప్పిస్తూ చెప్పిన రీజన్ తో గొడవ మొదలైంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2023 / 08:47 AM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిదో వారం చాలా రసవత్తరంగా సాగింది. నామినేషన్స్ లో జరిగిన గొడవలతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కింది. తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో అంతకు మించి రెచ్చిపోయారు హౌస్ మేట్స్. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ కి బిగ్ బాస్ ఇచ్చిన ఫైనల్ టాస్క్ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.ముఖ్యంగా యావర్,శోభా మధ్య జరిగిన గొడవ హైలెట్ గా నిలిచింది.యావర్ కెప్టెన్సీ రేస్ నుంచి శోభ ను తప్పిస్తూ చెప్పిన రీజన్ తో గొడవ మొదలైంది.

    యావర్ ని శోభా పిచ్చోడు అని అనడంతో ఇద్దరు తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు.ఇక ఈ రోజు వీకెండ్ కావడంతో నాగార్జున కంటెస్టెంట్స్ కి వాయింపుడు కార్యక్రమం పెట్టారు. శనివారం నాగార్జున ఒక్కొక్కరికి క్లాస్ పీకాడు.ముందుగా కెప్టెన్ గౌతమ్ కి తన ఫోటో ఉన్న ఫ్లాగ్ చూపించి అభినందించారు. తర్వాత ఈ వారంలో తప్పులు చేసిన కంటెస్టెంట్స్ జండాలు వరుసగా విరగ్గొట్టాడు నాగార్జున.

    అర్జున్,తేజ ప్రశాంత్ లు ఫ్లాగ్స్ నాగ్ విరిచేయడంతో మొహం మాడ్చుకున్నారు. ఇక తర్వాత శోభా ని లేపి గొడవ గురించి అడిగాడు నాగార్జున. దానికి శోభా ‘నన్ను కెప్టెన్సీ నుంచి యావర్ తీసెశాడు సార్. దానికి చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు అని నాగార్జున తో చెప్పింది. దానికి నాగార్జున ‘లాస్ట్ వీక్ భోలే నిన్ను ఎర్రగడ్డ అని అంటే నువ్వు తీసుకోలేక పోయావు గింజుకున్నావ్’. ‘మరి నువ్వు పిచ్చోడు అనడం కరెక్ట్ ఆ ‘ అని నిలదీసాడు.

    నీకు క్షమించే గుణం లేనప్పుడు మాటలు జారకూడదు కదా అంటూ నాగ్ శోభకు క్లాస్ పీకాడు. తర్వాత యావర్ తో మాట్లాడుతూ ‘నీకు ఒక వీడియో చూపిస్తా’ అంటూ నిన్న కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన గొడవ వీడియో చూపించాడు. నువ్వు రూల్స్ బ్రేక్ చేసి బిగ్ బాస్ ప్రాపర్టీ డామేజ్ చేశావు. మళ్ళీ నువ్వు నీ ఒరిజినల్ బిహేవియర్ కి వచ్చేసావ్ అంటూ యావర్ కి వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. వ్యక్తుల మీద ఫోకస్ తగ్గింది గేమ్ మీద పెట్టు అన్నాడు. రతికకు దూరంగా ఉండని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. సందీప్ బొంగులో అనే పదం వాడినందుకు గట్టిగా ఇచ్చేశాడు నాగ్. శివాజీని ఎవరిని కొట్టి వెళ్ళిపోతావ్, అన్నాడు. నన్ను నేనే కొట్టుకొని వెళ్ళిపోతా… ఇంట్లో పరిస్థితులు, ప్రవర్తనలు దారుణంగా ఉంటున్నాయని శివాజీ అన్నాడు. పదే పదే వెళిపోతా అనే పదం వాడకు అని నాగ్ అన్నాడు.

    ఇక ఈ వారం బాగా ఆడిన ప్లేయర్స్ పల్లవి ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, అశ్విని మాత్రమే అంటూ… వాళ్ళ ఫ్లాగ్స్ ఎగరేశాడు నాగార్జున. మిగతా వాళ్ళందరి జెండాను విరగొట్టి పక్కన పడేశాడు. ఇక నామినేషన్స్ లో అమర్ దీప్, శివాజీ, ప్రియాంక, గౌతమ్, శోభా, అశ్విని, భోలే, సందీప్ ఉన్నారు. వీరిలో ఇద్దరు సేవ్ అయ్యారు. వాటర్ ట్యాంక్ లో ఒక్కొక్కరి ఫోటోలు ఉన్న బిళ్ళలు నీళ్లలో వేసిన నాగార్జున తేలిన వారు సేఫ్, మునిగిన వారు నాట్ సేఫ్ అన్నాడు. గౌతమ్, ప్రియాంకల ఫోటోలు తేలాయి. దాంతో వారు సేవ్ అయ్యారు. నామినేషన్స్ లో మరో 6గురు ఉన్నారు.