https://oktelugu.com/

Bigg Boss 7 Telugu Elimination : ఆ ఇద్దరి జర్నీ వీడియోలు సిద్ధం… ఉత్కంఠ రేపుతున్న ఎలిమినేషన్!

మరి ఈసారైనా ఆడియన్స్ నిర్ణయించిన ప్రకారం ఎలిమినేషన్ జరుగుతుందో లేదో చూడాలి. సోషల్ మీడియా టాక్ ప్రకారం సందీప్ ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2023 / 11:22 AM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu Elimination : బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఎనిమిదో వారం నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ గొడవలు పడి ఫుల్ రచ్చ చేశారు. నామినేషన్ ప్రక్రియ ముగిసే సరికి మొత్తం ఎనిమిది మంది హౌస్ మేట్స్ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. శివాజీ,గౌతమ్ కృష్ణ,భోలే షావలి,అశ్విని శ్రీ,అమర్ దీప్,ఆట సందీప్,శోభా శెట్టి,ప్రియాంక జైన్ లిస్ట్ లో ఉన్నారు. కాగా ఎనిమిదో వారం ఓటింగ్ లిస్ట్ చూసుకుంటే శివాజీ కి బారి స్థాయిలో ఓటింగ్ నమోదయింది. అతనికి ఒక్కడికే 47 శాతం ఓట్లు పడ్డాయి.

    ఎనిమిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి ఎవరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకుందాం. అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి శివాజీ మొదటి స్థానంలో ఉన్నాడు. అమర్ దీప్ రెండో స్థానంలో ఉన్నాడు. మిగిలిన స్థానాల్లో చాలా మార్పులు జరిగాయి. చివరకు మూడో ప్లేస్ లో గౌతమ్ ఉన్నాడు. నాలుగో ప్లేస్ లో భోలే ఉండగా ఐదో స్థానంలో ప్రియాంక ఉన్నారు అని సమాచారం.

    ఇక కన్నింగ్ లేడీ శోభా ,అశ్విని,సందీప్ మాస్టర్ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు.కాగా మొదటి సారి నామినేషన్స్ లోకి వచ్చిన సందీప్ మాస్టర్ కి అతి తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ వారం కెప్టెన్సీ కోసం సైకోలా ప్రవర్తించిన శోభా చివరి రోజు ఓటింగ్ లో లాస్ట్ ప్లేస్ కి పడిపోయింది.వీరు ఆఖరి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆరో ప్లేస్ లో అశ్విని ఉంది. ఈ వారం ఊహించని విధంగా టాప్ కంటెస్టెంట్స్ అయిన శోభా,సందీప్ మాస్టర్ లో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

    ఇక వీళ్లిద్దరి జర్నీ వీడియోలు కూడా బిగ్ బాస్ టీం రెడీ చేశారని ఒక న్యూస్ వినిపిస్తుంది. శోభా తన శాడిజం తో బిగ్ బాస్ కి కావాల్సినంత కంటెంట్ ఇస్తుంది కాబట్టి శోభా సేఫ్ అయిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. కానీ శోభా ప్రవర్తన చూసి ఆడియన్స్ ఆమె ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారు. మరి ఈసారైనా ఆడియన్స్ నిర్ణయించిన ప్రకారం ఎలిమినేషన్ జరుగుతుందో లేదో చూడాలి. సోషల్ మీడియా టాక్ ప్రకారం సందీప్ ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు.