Bigg Boss 7 Telugu : ఎపిసోడ్ హైలెట్స్: ఉత్కంఠ మధ్య ఆ కంటెస్టెంట్ అవుట్, ప్రైజ్ మనీ వాళ్లకు పంచేస్తానన్న ప్రశాంత్!

ప్రశాంత్ సేవ్ అయ్యాడు. ఇక చివర్లో శోభ, గౌతమ్ మిగిలారు.వీరు కూడా అవిక్షన్ పాస్ వాడుకోలేదు. ఫైనల్ గా గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పారు. దాంతో హౌస్లో టాప్ 7 ఉన్నారు.

Written By: NARESH, Updated On : December 4, 2023 9:20 am
Follow us on

Bigg Boss 7 Telugu : ఆదివారం ఎపిసోడ్లో తారలు సందడి చేశారు. నా సామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం మరో గెస్ట్ గా హీరో నాని వచ్చారు. కొత్త సినిమా హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగంగా ఆయన హోస్ట్ నాగార్జున, కంటెస్టెంట్స్ తో ముచ్చటించారు. కాగా విన్నర్ గెలిచే ప్రైజ్ మనీని నాగార్జున గుర్తు చేశారు. టైటిల్ విన్నర్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షలతో పాటు మారుతీ సుజుకీ బ్రీజా కారు, రూ. 15 లక్షల విలువైన డైమండ్ జ్యూవెలరీ పొందొచ్చని చెప్పాడు. ఈ డబ్బులు ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాలని నాగార్జున అడిగారు.

శివాజీ తనకు ఎలాంటి ప్లాన్స్ లేవని చెప్పారు. చాలా మంది సొంత ఇంటి కల నెరవేర్చుకుంటాము. అప్పులు తీర్చుకుంటాము అని చెప్పారు. పల్లవి ప్రశాంత్ మాత్రం పేద రైతులకు పంచేస్తానని చెప్పాడు. ఎవరు పేద రైతులో నీకు ఎలా తెలుస్తుందని నాగార్జున అడిగారు. రైతులు కష్టపడి పంట పండిస్తారు. అది చేతికి వస్తుందో రాదో కూడా తెలియదు. చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు సహాయం చేస్తాను అన్నాడు.

మరోవైపు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సాగింది. అర్జున్ ఫినాలే అస్త్ర గెలుచుకున్న నేపథ్యంలో నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. దాంతో అతడు ఎలిమినేషన్ నుండి మినహాయింపు పొందాడని నాగార్జున చెప్పారు. ఓట్ల ఆధారంగా అర్జున్ లాస్ట్ లో ఉన్నాడు. ఫినాలే అస్త్ర గెలవడం వలన సేవ్ అయ్యాడని చెప్పాడు. ఇక ప్రియాంక, శోభ, శివాజీ, ప్రశాంత్, యావర్, గౌతమ్ నామినేషన్స్ లో ఉన్నారు.

వీరిలో ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. శోభా శెట్టి, గౌతమ్, ప్రశాంత్ మిగిలారు. ప్రశాంత్ వద్ద అవిక్షన్ పాస్ ఉంది. అది వాడుకోవాలని నాగార్జున సూచించాడు. లేదు సర్ నేను ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే హౌస్లో ఉంటాను. లేదంటే ఎలిమినేట్ అవుతానని ప్రశాంత్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అతని నమ్మకం నిజమైంది. ప్రశాంత్ సేవ్ అయ్యాడు. ఇక చివర్లో శోభ, గౌతమ్ మిగిలారు.వీరు కూడా అవిక్షన్ పాస్ వాడుకోలేదు. ఫైనల్ గా గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పారు. దాంతో హౌస్లో టాప్ 7 ఉన్నారు.