https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : దామిని, రతికా రోజ్, శుభశ్రీ… రీ ఎంట్రీ ఛాన్స్ ఎవరికంటే?

హౌస్ మేట్స్ తమకు ఇష్టమైన వారి పేరు రాసి బ్యాలెట్ బాక్స్ లో ఓటు వేశారు. ఓటింగ్ ముగిశాక ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున.

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2023 / 07:16 PM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu : ఈ సీజన్ అంతా ఉల్టా ఫల్టా అంటున్నాడు హోస్ట్ నాగార్జున. ఇది నిర్వాహకులకు బాగా కలిసొస్తుంది. బిగ్ బాస్ నిర్ణయాలకు ఎదురు చెప్పే వీలు లేకుండా పోతుంది. ఒక విధానం అంటూ లేదని, షోలో ఏదైనా జరగొచ్చని చెప్పకనే చెప్పారు. ఎన్నడూ లేని విధంగా ఐదు వారాల తర్వాత రీ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ ఐదుగురు కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపారు. గతంలో ఒకరిద్దరి కంటే వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండేవి కావు. అది కూడా షో మొదలైన రెండు మూడు వారాల్లోపే హౌస్లోకి పంపేవారు.

    ఈ సీజన్లో బిగ్ బాస్ తీసుకున్న మరో నిర్ణయం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఒకరికి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం. ఇందుకు ముగ్గురిని ఎంపిక చేశారు. సింగర్ దామిని, రతికా రోజ్, శుభశ్రీలలో ఒకరు హౌస్లో అడుగుపెట్టనున్నారు. అయితే ఎవరు ఇంట్లోకి వెళ్ళేది హౌస్ మేట్స్ నిర్ణయించాలి అన్నారు. వారి ఓట్ల ఆధారంగా నిర్ణయిస్తామని నాగార్జున చెప్పాడు. వారికి క్యాంపైన్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చాడు. ముగ్గురూ రీజన్స్ చెబుతూ తమకు ఓటు వేయాలని అభ్యర్ధించారు.

    హౌస్ మేట్స్ తమకు ఇష్టమైన వారి పేరు రాసి బ్యాలెట్ బాక్స్ లో ఓటు వేశారు. ఓటింగ్ ముగిశాక ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. అధిక ఓట్లు వచ్చిన వాళ్ళు కాదు, తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఇంట్లోకి వస్తున్నట్లు చెప్పి షాక్ కి గురి చేశాడు. అలాగే ఎవరు ఎవరికి ఓటు వేశారో చెప్పొద్దని ఆదేశించాడు. అందుతున్న సమాచారం ప్రకారం రతికా రోజ్ రీఎంట్రీ ఇస్తుందట. అంటే హౌస్ మేట్స్ రతికా రోజ్ వద్దనుకున్నారన్న మాట.

    రతికా రోజ్ మోస్ట్ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. తన ఆట తీరుతో రతికా రోజ్ సోషల్ మీడియాలో నెగిటివిటీకి గురైంది. ఆమెను వెంటనే ఎలిమినేట్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. రతికా కన్నింగ్ గేమ్ తో రాణించాలని చూసింది. అలాంటి కంటెస్టెంట్ ని మరలా ఇంట్లోకి పంపుతున్నారు. అది కూడా రివర్స్ ఓటింగ్ ద్వారా. ఎవరు ఎలిమినేట్ అయ్యేది ప్రేక్షకులు మాత్రమే నిర్ణయిస్తారనే నాగార్జున… దామిని, శుభశ్రీ, రతికాలలో ఎవరు హౌస్లోకి వెళ్లాలో ప్రేక్షకులకు వదిలేయాల్సింది. ఓటింగ్ పెడితే విమర్శలకు తావు లేకుండా ఉండేది.