https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ లోకి వెళ్లిన కొత్త కంటెస్టెంట్స్ వీరు.. హాట్ హీరోయిన్ కూడా.. వీళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదీ

. ఒక్క కెప్టెన్ పల్లవి ప్రశాంత్ మాత్రం వీఐపీ రూమ్‍లో పడుకుంటాడు. ఇప్పుడు హౌస్‍లో మెుత్తం 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరంతా కన్ఫర్మ్ అయిన హౌస్ మేట్స్. ఇక రాను రాను బిగ్ బాస్ 7 తెలుగు ఆసక్తిగా సాగనుంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2023 / 10:36 AM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ సారి అంతా ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచే చెప్పారు నాగార్జున. చెప్పిన విధంగానే కేవలం  బిగ్ బాస్ సీజన్ 7లో 14 మందినిమాత్రమే హౌస్ లోకి పంపించారు. అయితే ఇందులో ఎవరు కూడా హౌజ్ మేట్స్ కాదని.. కేవల పవర్ అస్త్రా అందుకున్న వారు మాత్రమే ఇంటి సభ్యులు అవుతారనేది తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే గేమ్ ఆడుతున్నారు. ఇప్పటికే హౌస్ నుంచి నలుగురు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇదిలా ఉంటే కొత్త కంటెస్టెంట్లు ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి వెళ్లారు. దీంతో బిగ్ బాస్ 2.0 రసవత్తరంగా మారింది. ఉల్టా పుల్టా అని చెప్పినట్టుగానే తాజా వీకెండ్ ఎపిసోడ్ ఉంది. ఎవరూ ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ చేశారు. శుభ శ్రీని ఇంటికి పంపించేశారు. ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయిన గౌతమ్‍ను కూడా ఇంటికి పంపించేందుకు పిలిచాడు బిగ్ బాస్. అయితే వెళ్లిపోయేముందు ఓ ట్విస్ట్ ఇచ్చాడు. సీక్రెట్ రూమ్‍లోకి గౌతమ్‍ను పంపించారు నాగార్జున.
    ఇక హౌస్‍లోకి ఒకేసారి ఐదుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంకా ఎంతమంది వస్తారోనని శివాజీ, టేస్టీ తేజ తెగ నవ్వేసుకున్నారు. ఒకేసారి పంపించండయ్యా అంటూ శివాజీ కామెడీ చేశాడు. బిగ్ బాస్ హౌస్‍లోకి వచ్చిన కొత్త కంటెస్టెంట్లు ఎవరో చూద్దాం..
    బిగ్ బాస్ సీజన్ 7లో మెుదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయింది అర్జున్ అంబటి. బుల్లితెర ప్రక్షకులకు అర్జున్ బాగా తెలుసు. అగ్నిసాక్షి సీరియల్ తో టీవీ ప్రేక్షకులకు దగ్గరైన అర్జున్ అంబటి ఇప్పుడు దేవత’ సీరియల్‌లో ఆదిత్యగా మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ సీరియల్ నటుడు ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో సందడి చేయనున్నాడు. ‘అర్ధనారి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన అర్జున్ అంబటి ‘సౌఖ్యం’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. కొంత గ్యాప్ తర్వాత ‘సుందరి’ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో పూర్ణ హీరోయిన్.
    వైల్డ్ కార్డ్ రెండో ఎంట్రీగా వచ్చింది అశ్విని శ్రీ. ఈమె ఇన్‍స్టాగ్రామ్‍లో ఫేమస్. ఆమె గురించి ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. కానీ తాను ఏంటో నిరూపించుకుంటాను అని తెలిపింది ఈ భామ. అయితే ఈమె సినిమాల్లోకి రావడం ఫ్యామిలీ మెంబర్స్ కి ఇష్టం లేదట. కానీ తనకు ఇష్టమైన ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చాను అని తెలిపింది. అమీర్ పేటలో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. నందు, శ్రీముఖి జంటగా వచ్చిన బీటెక్ బాబులు సినిమాలలో కూడా మెప్పించింది. ఈ సినిమాల తర్వాత మరిన్ని చిన్న సినిమాల్లో కూడా నటించింది కానీ ఆశించిన రేంజ్ లో పేరు సంపాదించలేకపోయింది అమ్మడు.
    ఇక మూడో ఎంట్రీ ఇచ్చారు భోలే షావలి. ప్రైవేట్ పాటలు పాడుతూ బాగా పేరు తెచ్చుకున్నాడు. పాలమ్మినా.. అనే పాటను ఇతడే పాడింది. ఇతను ఒక మ్యూజిక్ కంపోజర్, ప్లేబ్యాక్ సింగర్ & సాంగ్ రైటర్. పెనుగొండ గ్రామం, మహబూబాబాద్ జిల్లా, లో జన్మించారు ఈ సింగర్. బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన సాంగ్ పాడింది ఎవరో కాదు భోలేనే..
    నాలుగో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజా మూర్తి. నిజానికి ఈమె మెుదట్లోనే ఎంటర్ కావాలి. కానీ ఆమె తండ్రి చనిపోవడంతో రాలేకపోయింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టింది. అయితే ఇన్‍స్టాగ్రామ్ ఇన్‍ఫ్లుయెన్సర్‍ అయిన పావని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన పూజా మూర్తి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ సీరియల్స్ లో తొలుత కనిపించిన పూజా మూర్తి తెలుగులోకి గుండమ్మ కథ అనే ధారావాహిక ద్వారా పరిచయం అయింది. ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తూ.. లావుగా ఉన్న అమ్మాయి కాపురం ఎలా సాగిస్తుంది అనే కథాంశంతో వచ్చిన ఈ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది పూజా మూర్తి.
    మెుత్తానికి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్‍లోకి పంపించారు. భోలే షావలి, పూజా మూర్తి, నైని పావనిని హోస్ట్ ఆఫ్ బెడ్స్ గా చెప్పారు నాగార్జున. అంటే ఎవరు ఎక్కడ పడుకోవాలని వీళ్లై డిసైడ్ చేస్తారు. ఒక్క కెప్టెన్ పల్లవి ప్రశాంత్ మాత్రం వీఐపీ రూమ్‍లో పడుకుంటాడు. ఇప్పుడు హౌస్‍లో మెుత్తం 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరంతా కన్ఫర్మ్ అయిన హౌస్ మేట్స్. ఇక రాను రాను బిగ్ బాస్ 7 తెలుగు ఆసక్తిగా సాగనుంది.