Bigg Boss 6 Telugu: గడిచిన బిగ్ బాస్ సీజన్స్ లో ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఊహించగలిగాం..ఎందుకంటే సోషల్ మీడియా లో పలు వెబ్సైట్స్ నిర్వహించే పోలింగ్స్ ఆధారంగా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చాలా తేలికగా తెలిసేది..కానీ ఈసారి మాత్రం ఎవ్వరూ ఊహించని క్యాండిడేట్లు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఈ సీజన్లో ఎవ్వరూ ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి..గత వారం సుదీప ఎలిమినేట్ అవ్వడం అందరూ ఊహించిందే కానీ, చంటి మరియు ఆరోహి ఎలిమేషన్స్ మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.. ఎందుకంటే సోషల్ మీడియా లో వీళ్లిద్దరికీ మంచి ఓటింగ్స్ వచ్చాయి.

ఇక ఈ వారం జరగబోయే ఎలిమినేషన్స్ కూడా ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా ఉంటుందట..ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి రేవంత్, రోహిత్, శ్రీహన్ , అర్జున్ కళ్యాణ్ ,బాలాదిత్య, ఆది రెడ్డి , రాజ్ శేఖర్, ఇనాయ సుల్తానా,ఫైమా, వాసంతి,శ్రీ సత్య , మెరీనా నామినేట్ అయ్యారు..సోషల్ మీడియా లో జరిగిన ఓటింగ్ ప్రకారం ఈ వారం అతి తక్కువ ఓటింగ్ తో ఎలిమినేట్ అయ్యే ఇంటి సభ్యురాలు మెరీనా.
దాదాపుగా సోషల్ మీడియా ఉండే అన్ని వెబ్సైట్స్ లో జరిపిన పోలింగ్ లో ఇదే తేలింది..కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం ప్రస్తుతం అర్జున్ కళ్యాణ్ టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతున్నాడు..హౌస్ లోకి వచ్చిన ప్రారంభంలో గేమ్ మీదకంటే ఎక్కువగా శ్రీ సత్య మీద ఫోకస్ పెట్టిన ఈయన, గత రెండు వారాల నుండి టాస్కులు చెలరేగిపోయి ఆడుతున్నాడు.
మొదటి నుండి గ్రూప్ గా స్నేహం చేస్తున్న వారితో కూడా తనకి తప్పు అనిపిస్తే గొడవలు పెట్టేసుకుంటున్నాడు..ఈ వారం తన స్నేహితులైన శ్రీహాన్, శ్రీ సత్య మరియు రేవంత్ లతో గొడవలు పెట్టుకున్నాడు..అలా అర్జున్ పూర్తిగా గేమ్ మీద ఫోకస్ పెట్టడంతో సోషల్ మీడియా లో జరిగే పొలింగ్స్ లో టాప్ 3 స్థానంకి ఎగబాకాడు..అలాంటి కంటెస్టెంట్ ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాడు అని వార్తలు రావడం నిజంగా అందరిని షాక్ కి గురి చేస్తున్న విషయం.
గేమ్ మీద ఫోకస్ పెట్టనప్పుడు నామినేషన్స్ కి వచ్చి సేవ్ అయినా అర్జున్, ఇప్పుడు గేమ్ మీద దృష్టి పెట్టి బాగా ఆడుతున్న సమయంలో ఎలిమినేట్ అవ్వడం ఏమిటి..? బిగ్ బాస్ లో రాజకీయాలు జరుగుతున్నాయా..అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి..మరి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు అనే వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.