Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో మళ్లీ నాగార్జున కొరఢా ఝలిపించాడు. బాగా ఆడని కంటెస్టెంట్లను ఏకిపారేశాడు. నిలబెట్టి కడిగేశాడు.

నిన్న జరిగిన ఎపిసోడ్ ను ప్రేక్షకులతో కలిసి నాగార్జున వీక్షించాడు. ఈ సందర్భంగా సత్యశ్రీ చేష్టలను చూపించారు. ఆమె అర్జున్ తో చీత్కారంగా వ్యవహరించిన తీరు.. అనంతరం రేవంత్ కు దానిపై ఫిర్యాదు.. కీర్తి బాధలను విని స్పందించిన వైనాన్ని చూపించారు. సత్యశ్రీ తనకు ఉండబుద్ది కావడం లేదని.. పంపిస్తే వెళ్లిపోతానంటూ చెప్పుకొచ్చింది.
అనంతరం ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విభజించిన వంటపోటీలు పెట్టారు. ఇందులో రేవంత్ టీం, మెరినా-రోహిత్ టీంలు పోటీపడ్డాయి. మిరపకాయ బజ్జీ, పకోడీలు, ఆలు బజ్జీలు చేయాలని పోటీపెట్టారు. ఇందులో బెటర్ గా వండిన ‘రేవంత్’ టీంను విజేతగా కెప్టెన్ ఆదిరెడ్డి ప్రకటించారు.
ఇక సూర్య-ఆరోహిల మధ్య లవ్ ట్రాక్ ఇంట్లో సందడి చేస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా? లవ్ నా? అన్నది డౌట్ కొడుతోందని సతశ్రీ వాళ్లనే ప్రశ్నించింది. దీనికి సూర్య, ఆరోహిలు నేరుగా స్పందించకుండా నవ్వి ఊరుకోవడంతో దీనిపై నాగార్జున కూడా అనుమానం వ్యక్తం చేశారు. ప్రేక్షకులను అడిగి క్లారిటీ తీసుకున్నారు.
అనంతరం ఇంటి సభ్యులను హౌస్ లో నిలబెట్టి మరీ ఒక్కరొక్కరిని నిలదీశారు. ఒక్కొక్కరి తప్పులను వీడియోలను చూపించి మరీ ఎత్తి చూపుతూ కడిగేశాడు.
ముఖ్యంగా బాలాదిత్యకు నాగార్జున క్లాస్ తీసుకున్నాడు.ఈ వారం నువ్వు ఆడిన తీరు మేం షాక్ అయ్యాం అని అన్నాడు. కళ్లముందు గొడవ జరుగుతున్నా తనకు పట్టనట్టుగా ఉన్నావని ఒక వీడియోను చూపించి మరీ నాగార్జున కడిగేశాడు. దానికి బాలాదిత్య కవర్ చేసినా నాగార్జున ఒప్పుకోలేదు. బాగా ఆడాలని హితవు పలికారు. గత వారం ఆడని కారణంగా 9మంది సోఫా వెనక్కి పంపించి తప్పులను ఎత్తి చూపాడు. వారిలో శ్రీసత్య, శ్రీహాన్ బాగా ఆడారని వారిని సోఫాలో కూర్చోబెట్టాడు.
ఇక బిగ్ బాస్ ఇచ్చిన పవర్ మేరకు హోస్ట్ నాగార్జున తొలిసారి ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో సరిగా ఆడని ఇద్దరిని డైరెక్ట్ వచ్చేవారం ఎలిమినేషన్ కోసం నామినేట్ చేశాడు. అర్జున్, కీర్తి లను నాగార్జున నామినేట్ చేశాడు. వారు బాగా ఆడకపోతే వచ్చేవారం ప్రేక్షకులు ఎలిమినేట్ చేస్తారని ప్రకటించాడు. అలా ఈ శనివారం ముగిసింది.