Bhuma Mounika Manchu Manoj: జీవితం మనల్ని చాలా చోట్లకి తీసుకెళ్తుంది..కానీ ప్రేమ జీవితం ఉన్న చోటుకు తీసుకెళ్తుంది. ఇది మంచు మనోజ్ కు అనుభవంలోకి వచ్చింది. భూమా మౌనికకు, ఆమె ఐదు సంవత్సరాల కొడుకు ధైరవ్ కు కళ్ళ ముందు కనిపిస్తోంది. కొంతకాలంగా సహజీవనంలో ఉన్న మౌనిక, మనోజ్ ఇటీవల పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ గతం తాలూకు చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. మనోజ్ తను ప్రేమించిన ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. కారణాలు ఏంటో తెలియదు గానీ వాళ్ళిద్దరి మధ్య బంధం చిక్కబడలేదు. అభిప్రాయ భేదాలు.. వెరసి ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఎవరి దారుల్లో వారు ప్రయాణించారు. ప్రణతి రెడ్డి ప్రస్తుతానికి ఎక్కడ ఉందో తెలియదు. ఆమె సెలబ్రిటీ కాదు కాబట్టి మీడియా కూడా అంత ఫోకస్ చూపించదు. మంచు మనోజ్ సినిమాలు కూడా చేయకుండా కొద్ది రోజులపాటు సైలెంట్ అయిపోయాడు. ఇదే నేపథ్యంలో భూమా మౌనిక తన మొదటి భర్త ద్వారా విడాకులు తీసుకుంది. ఆ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. పెద్ద పెద్ద కుటుంబాల్లో అభిప్రాయ బేధాలు వస్తే సైలెంట్ గా ఎవరి ప్రయాణం వారు సాగిస్తారు. భూమా మౌనిక విషయంలోనూ అదే జరిగింది. సో అటు మనోజ్ ది, ఇటు మౌనిక ది సేమ్ స్టోరీ.
విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి అన్నట్టు.. ఎక్కడ కలిశారో, ఎలా కలిశారో తెలియదు కాని, మొత్తానికీ మనోజ్, మౌనిక కలిశారు. కలిసి బతికేందుకు ఒకే చెప్పుకున్నారు. కలిసి జీవించడం మొదలుపెట్టారు. కొద్దిరోజులైన తర్వాత పెళ్లి చేసుకున్నారు. తన ద్వారా రానివారిని ఆడవాళ్ళు బిడ్డలుగా ఎలా ఒప్పుకోరో.. తన వల్ల పుట్టని వారిని కూడా మగవాళ్లు పిల్లలుగా గుర్తించలేరు. దీనికి ఆర్థిక అంతరం అలాంటి వేవీ ఉండవు. అన్ని కుటుంబాల్లోనూ ఇలానే ఉంటుంది. కానీ మంచి మనోజ్ డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి.. త్వరగానే మౌనిక కుమారుడిని ఓన్ చేసుకున్నాడు. ఎంతలా అంటే ఆ ఐదు సంవత్సరాల పిల్లగాడికి తండ్రి అయిపోయాడు. తల్లిని తీసుకున్న తర్వాత తండ్రి కావాలని లేదు. కానీ మనోజ్ మౌనికకు భర్త మాత్రమే కాదు.. ఆమె ఐదు సంవత్సరాల కొడుకుకి ప్రేమను పంచే తండ్రి కూడా అయ్యాడు. తమ ప్రైవసీకి అడ్డుగా ఉంటాడేమో నన్న భయం కూడా అతనిలో లేదు. ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఆ ప్రేమతోనే అతడికి దగ్గరయ్యాడు. పిల్లలు కూడా అంత ఈజీగా తన తండ్రిని కాకుండా తన తల్లిని చేసుకున్న వేరే వ్యక్తిని నాన్నగా అంగీకరించలేరు. ఆ ఐదు సంవత్సరాల పిల్లగాడు మనోజ్ ను తన తండ్రిగా ఓన్ చేసుకున్నాడు.
ఇక ఇటీవల భూమా మౌనిక ఐదు సంవత్సరాల బాబు పుట్టినరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ మంచు మనోజ్. ఆ అబ్బాయి పుట్టినరోజు వేడుకల్ని అన్ని అన్నీ స్వయంగా ఉండి జరిపాడు. అతన్ని చేతుల్లోకి తీసుకొని కేక్ కట్ చేయించాడు. ప్రేమగా ముద్దులు పెట్టాడు. ఆ బాబు తన తల్లి మౌనిక దగ్గర కంటే మనోజ్ దగ్గరే ఎక్కువ ఉన్నాడు. అతడి చేతిలో ఒదిగి పోయాడు. చూసే వాళ్లకు ఇది వింతగా అనిపించవచ్చు. ముందుగానే చెప్పినట్టు జీవితం మనల్ని చాలా చోట్లకు తీసుకెళ్తుంది. ప్రేమ జీవితం ఉన్న చోటుకు తీసుకెళ్తుంది. ప్రేమల్ని, బంధాల్ని అక్కడ ముడి వేస్తుంది.