https://oktelugu.com/

Anil Sunkara : చిరంజీవిపై అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు… ఆపై వాట్సప్ చాట్ లీక్!

చిరంజీవి గారితో నేను మరో సినిమా తీస్తున్నానని’ వాట్స్ అప్ చాట్ లో అనిల్ సుంకర తెలియజేశారు. ఈ రెండు వార్తల్లో ఏది నిజమో తెలియక జనాలు తికమక పడుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 14, 2023 / 10:12 PM IST
    Follow us on

    Anil Sunkara : ఇటీవలే భోళా శంకర్ సినిమా నిర్మించిన  నిర్మాత అనిల్ సుంకర తీవ్రంగా నష్టపోయారు.  ఈ మూవీ దారుణ పరాజయం చవి చూసింది. భోళా శంకర్ రూ. 50 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ డే భోళా శంకర్ వరల్డ్ వైడ్ షేర్ రూ . 16 కోట్లకు మించలేదు. ఇక సెకండ్ డే రూ. 5-6 కోట్లు, మూడో రోజు దారుణంగా రూ. 3 కోట్లకు పడిపోయింది. ఆచార్య మొదటి రోజు వసూళ్లలో సగం కూడా భోళా శంకర్ వసూళ్లు లేవు. అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్, భోళా శంకర్ తీవ్ర నష్టాలు మిగిల్చాయి. అనిల్ సుంకర ఈ అప్పులు చెల్లించేందుకు తన ఫాం హౌస్ అమ్మేశారనే ఓ వార్త తెరపైకి వచ్చింది.

    అలాగే సినిమా ఫలితం దారుణంగా ఉన్నా చిరంజీవి తన మొత్తం రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని మరో వాదన. ఈ క్రమంలో అనిల్ సుంకర చిరంజీవిని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారంటూ ఓ మీడియా ఛానల్ లో ప్రచారం చేస్తోంది. ఎంత పెద్ద సీనియర్ అయిన నిర్మాతకు అండగా ఉండాలి. అప్పుడే నిజమైన హీరోలు అవుతారు. ఈ విషయంలో సూపర్ స్టార్ కృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని అనిల్ సుంకర అన్నట్లు మీడియా కథనాల సారాంశం.

    చిరంజీవిపై అనిల్ సుంకర పరోక్షంగా కామెంట్స్ చేశారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆయన వాట్స్ అప్ చాట్ బయటకు వచ్చింది. మీరు చిరంజీవిని ఉద్దేశించి ఇలా అన్నారంటూ న్యూస్ పై కొందరు విలేకరులు అనిల్ సుంకరను అడగ్గా… ‘అదంతా అబద్ధం. చిరంజీవి అలాంటి వారు కాదు. ఆయన గొప్ప మానవతావాది. చిరంజీవి గారితో నేను మరో సినిమా తీస్తున్నానని’ వాట్స్ అప్ చాట్ లో అనిల్ సుంకర తెలియజేశారు. ఈ రెండు వార్తల్లో ఏది నిజమో తెలియక జనాలు తికమక పడుతున్నారు.

    అధికారికంగా స్పష్టత ఇస్తే బాగుందని భావిస్తున్నారు. భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదలమ్ రీమేక్ గా తెరకెక్కింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. తమన్నా చిరంజీవికి జంటగా నటించారు. కీర్తి సురేష్ కీలకమైన చెల్లి పాత్ర చేసింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. నెక్స్ట్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ చేస్తున్నట్లు సమాచారం.