#BheemlaNayak Release Trailer Review: సింహం బోనులో ఉన్నంత వరకే ఓర్పు.. ఒక్కసారి బయటకు వచ్చిందా జూలు విదిలిస్తుంది. ఇప్పుడు ఎన్నాళ్లుగానో అణిచిపెట్టుకున్న ఆవేశాన్ని పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ మూవీతో ఆవిష్కరించాడు. ఆ ఆవేశానికి బాక్సాఫీస్ బద్దలవుతోంది. రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్లు కొల్లగొడుతోంది.

పవన్ కళ్యాణ్ లో మంచి ఫైర్ ఉంది. దాన్ని సరిగ్గా వాడుకోవడం తెలియక కొన్ని సినిమాల్లో ఆయన్ను కామెడీ పీస్ గా చూపించారు. పవన్ బాగా కామెడీ చేస్తారు. కానీ ఆయనను అలా చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడరు. అందుకే అజ్ఞాతవాసిని ఆదరించలేదు. అదే ‘వకీల్ సాబ్’ను హిట్ కొట్టించారు.
ఇప్పుడు ‘భీమ్లానాయక్’లో పవన్ వీరావేశాన్ని చూపించారు. ఆ దెబ్బకు పవన్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోతోంది. సాధారణ జనాలకు కూడా పవన్ లోని ఆగ్రహం కనిపించింది. ఆయన ఆవేదన, ఆక్రందన.. నటనకు మంచి మార్కులు పడ్డాయి.
సరైన ప్రత్యర్థిగా రానా కనిపించారు. తాజాగా భీమ్లానాయక్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ‘భీమ్లానాయక్ రిలీజ్ ట్రైలర్’ను విడుదల చేశారు. పక్కా మాస్ మసాలాలు యాడ్ చేసి.. ఫైట్స్ ను, ఎమోషనల్ సీన్లను చూపించారు. ఈ కొత్త ట్రైలర్ ప్రేక్షకులకు గూస్ బాంబ్స్ తెప్పిస్తోంది. పవన్ ఫైట్స్ మునుపెన్నడూ లేనంతగా ఆకట్టుకుంటున్నాయి. పవన్ పోలీస్ గా ఇరగదీసేశాడని చెప్పాలి. రానా అంతే స్థాయిలో విలన్ గా అదరగొట్టాడు. పవన్, రానా కొదమ సింహాల్లా తలపడ్డారు.
తాజా ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. భీమ్లానాయక్ గా పవన్ కళ్యాణ్ విశ్వరూపమే చూపించాడని అర్థమవుతోంది. అహంకారానికి, ఆత్మగౌరవానికి మడమ తిప్పని యుద్ధమే జరిగింది. ఈ ట్రైలర్ లో అదే కనిపించింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టేలా ఉన్న ఆ ట్రైలర్ ను మీరూ కింద చూసి ఎంజాయ్ చేయండి.. మీ కామెంట్ జత చేయండి.

[…] Balakrishna Dual Role: నట సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో నీటి సమస్య చుట్టూ కథ తిరుగుతుందని.. బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని సమాచారం. రెండు పాత్రల మధ్య వేరియేషన్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. […]