https://oktelugu.com/

Best Car Sales In Febrauary: 2024 ఫిబ్రవరిలో అత్యధికంగా సేల్స్ అయిన కార్లు ఇవే..

ఫిబ్రవరి నెలకు సంబంధించిన కార్ల అమ్మకాల గణాంకాలు బయటకు వచ్చాయి. ఇందులో ఎక్కువగా మారుతి సుజుకీకి చెందిన కార్లే అమ్ముడుపోయాయి. వి

Written By:
  • Srinivas
  • , Updated On : March 11, 2024 4:54 pm
    Car Sales February

    Car Sales February

    Follow us on

    Best Car Sales In Febrauary: కాలం మారుతున్న కొద్దీ కార్ల అవసరం పెరుగుతోంది. దీంతో కార్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రెండు నెలల్లోనే కార్లు అత్యధికంగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన కార్ల అమ్మకాల గణాంకాలు బయటకు వచ్చాయి. ఇందులో ఎక్కువగా మారుతి సుజుకీకి చెందిన కార్లే అమ్ముడుపోయాయి. వివిధ ఆ తరువాత టాటా, హ్యుందాయ్ కంపెనీలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    దేశంలో అత్యధికంగా కార్లు విక్రయించే మారుతి మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ నుంచి ఎప్పటిలాగే వ్యాగన్ ఆర్ అత్యధికంగా విక్రయాలు జరుపుకుంది. వ్యాగన్ ఆర్ ప్రస్తుతం రూ.5.55 లక్షల ప్రారంభం నుంచి రూ.7.38 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇది పెట్రోల్ వేరియంట్ లో 25.19 కిలోమీటర్ల మైలేజ్, సీఎన్ జీలో 34.05 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. ఈ కారు ఫిబ్రవరి నెలలో 19,412 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో 16,889 యూనిట్లు విక్రయించారు. గతేడాది కంటే ఈ సంవత్సరం 15 శాతం అమ్మకాలు పెరిగాయి.

    మారుతికి గట్టి పోటీ ఇస్తూ టాటా నిలబడుతోంది. ఈ కంపెనీకి చెందిన SUV పంచ్ అత్యధికంగా విక్రయించబడిన కారుగా నిలిచింది. దీనిని ఫిబ్రవరి నెలలో 18,438 మంది కొనుగోలు చేశారు. 2023 జనవరిలో ఇది 11,169 యూనిట్లు అమ్ముడు పోయింది. పంచ్ అమ్మకాలు గత ఏడాది కంటే ఈ సంవత్సరం 65 శాతం పెరిగడం విశేషం.

    టాటా పంచ్ తరువాత మరోసారి మారుతి బాలెనో మూడో స్థానంలో నిలిచింది. 2024 ఫిబ్రవరిలో ఈ మోడల్ 17,517 యూనిట్లు విక్రయించారు. అయితే ఇది గత నెల అంటే ఫిబ్రవరిలో మొదటిస్థానంలో నిలిచింది. అయితే మారుతి బాలెనో గతేడాది కంటే ఇప్పుడు 8 శాతం వార్షిక విక్రయాఉ క్షీణించాయి.

    మారుతి కి చెందిన సెడాన్ డిజైఱ్ అత్యధికంగా విక్రయాలు జరుపుకున్న కార్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. ఇది గత నెలలో 15,837 యూనిట్లు విక్రయించబడ్డాయి. అయతే గతేడాది కంటే ఈ సంవత్సరం 5.73 శాతం విక్రయాలు క్షీణించాయి. ఈ కారు తరువాత బ్రెజ్జా 15,519 యూనిట్లతో 5వ స్థానంలో.. ఎర్టీగా 6వ స్థానంలో నిలిచాయి. హ్యుందాయ్ క్రెటాకు సైతం పై రెండు కంపెనీలతో పోటీ పడింది. ఈ కంపెనీకి చెందిన క్రెటా 2024 ఫిబ్రవరి నెలలో 15,276 యూనిట్లు సేల్స్ అయ్యి 7వ స్థానంలో నిలిచింది.