Rahul Dravid: ద్రావిడ్ పైన కీలక నిర్ణయం తీసుకోనున్న బిసిసిఐ…

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా సమయం ఉన్న నేపధ్యం లో ఇప్పుడు ఇండియన్ టీమ్ 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ను ఆడుతుంది. ఇక దీని తర్వాత ఇండియన్ టీమ్ ఇంగ్లండ్‌కు, సౌతాఫ్రికాకు స్వాగతం పలికేందుకు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ సిద్ధమవ్వాల్సి ఉంటుంది.

Written By: Gopi, Updated On : November 29, 2023 6:23 pm

Rahul Dravid

Follow us on

Rahul Dravid: ప్రపంచకప్ 2023 లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ టీం ఆస్ట్రేలియా మీద ఓడిపోయి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇక దానికి తోడుగా ఇప్పుడు ఆస్ట్రేలియా టీం పైన ఇండియా 5 t20 సిరీస్ ల మ్యాచ్ లను ఆడుతుంది. అందులో భాగంగానే ఇండియా ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించగా, ఒక మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఇండియా ఒక మ్యాచ్ గెలిస్తే సీరీస్ కైవసం చేసుకుంటుంది.

అలా కాకుండా ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ ల్లో గ్రాండ్ గా విజయం సాధించినట్లయితే ఆస్ట్రేలియా ఈ సిరీస్ ని కూడా కైవసం చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ల్లో ఇండియన్ టీం ఓడిపోవడం అనేది ఒక తీవ్రమైన నిరాశగా భావించడమే కాకుండా ఒక ఘోర అవమానంగా కూడా మనం పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ క్రమంలోనే ఇండియన్ టీమ్ కొనసాగుతున్న రాహుల్ ద్రావిడ్ నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆయన తన హెడ్ కోచ్ పదవీకాలం ముగిసిపోవడంతో ఇప్పుడు బీసీసీఐ నిర్ణయం ప్రకారం కొద్దిరోజులు తన పదవి లో కొనసాగుతాడా లేదా అనే విషయం మీద క్లారిటీ అయితే రావడం లేదు…

ఇక వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా సమయం ఉన్న నేపధ్యం లో ఇప్పుడు ఇండియన్ టీమ్ 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ను ఆడుతుంది. ఇక దీని తర్వాత ఇండియన్ టీమ్ ఇంగ్లండ్‌కు, సౌతాఫ్రికాకు స్వాగతం పలికేందుకు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ సిద్ధమవ్వాల్సి ఉంటుంది. బీసీసీఐ ఆఫర్ కు ద్రావిడ్ సానుకూలంగా స్పందించకపోతే ప్రస్తుతం ఎన్‌సీఏ (నేషనల్ క్రికెట్ అకాడమీ) చీఫ్‌గా ఉన్న ఒకప్పటి లెజెండరీ అతగాడు అయిన వీవీఎస్ లక్ష్మణ్‌కు ఇండియన్ టీమ్ కోచ్ బాధ్యతలు అప్పగించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరి కోసం బీసీసీఐ కాంట్రాక్ట్ పత్రాలను సిద్ధం చేసిందని మరొక రిపోర్ట్ పేర్కొంది. కాగా ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియాను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమం లో ఇండియన్ టీమ్ యొక్క పూర్తి బాధ్యతలను ఎవరు స్వీకరిస్తారు అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్రా అసక్తి నెలకొంది…ద్రావిడ్ కనక ఇంకా తన పదవి లో కొనసాగితే అటు ఆయనకి ఇటు ఇండియన్ టీమ్ కి రెండింటికీ ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది…

ఇక ఒకవేళ రాహుల్ ద్రావిడ్ ను కొనసాస్తారా, లేదా ఆయన ఒప్పుకోకపోతే వివిఎస్ లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగిస్తారా,లేదా అనేది త్వరలోనే తేలనుంది. కొత్త బాధ్యతలు దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ప్రారంభమవుతుంది. ఇక సౌతాఫ్రికా తో మూడు టి 20 లు మూడు వన్డేలు ఇండియన్ టీమ్ ఆడాల్సి ఉంది…ఇక ఈ క్రమం లోనే ఇండియన్ టీమ్ ఏ మేరకు రాణిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…

ఇక ఇండియన్ టీమ్ వచ్చే ఏడాది జరిగే టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాల్సి ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీమ్ ఎలాగైనా తమ సత్తా చాటాల్సి ఉంటుంది… లేకపోతే మాత్రం ఇండియన్ టీమ్ అన్ని దేశాల కంటే కూడా వెనకబడాల్సి ఉంటుంది…