Rohit Sharma : ప్రస్తుతం ఇండియన్ టీం ప్లేయర్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా మీద ఓడిపోయి క్రికెట్ అభిమానులను విపరీతమైన నిరాశకు గురి చేశారు. ఇక అప్పటినుంచి చాలామంది అసలు క్రికెట్ మ్యాచ్ లు చూడడం కూడా మానేశారు. క్రికెట్ గురించి తెలుసుకోవడానికి కూడా పెద్దగా ఇష్టపడటం లేదు…
ఇక ఇది ఇలా ఉంటే 2024 లో జరిగే టి20 వరల్డ్ కప్ కోసం ఇండియన్ టీం సర్వం సిద్ధం చేస్తుంది. వన్డే వరల్డ్ కప్ బాధ నుంచి క్రికెట్ అభిమానులు అందరినీ కొలుకునేలా చేయాలనే ఉద్దేశ్యంలో బిసిసిఐ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీని కోసమే ఇప్పటినుంచి ప్లేయర్ల ఎంపికలో గాని, కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారు అనే విషయం మీద బీసీసీఐ సీరియస్ గా నిర్ణయాలను తీసుకోబోతున్నట్లు గా కూడా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా జరిగిన ఒక మీటింగ్ లో బీసీసీఐ రోహిత్ శర్మ పట్ల సానుకూలంగా వ్యవహరించినట్లు గా తెలుస్తుంది.
నిజానికి రోహిత్ శర్మ టి 20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా కొనసాగుతాడు అనే విషయాలు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి కానీ అధికారికంగా బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే బీసీసీఐ టీం లో ఉన్న ఒక బోర్డ్ మెంబర్ తో రోహిత్ శర్మ తన కెప్టెన్సీ మీద ఒక క్లారిటీ ఇస్తే నేను ఏం చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటానని అతనితో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన వెళ్లి బీసీసీఐ బోర్డు మెంబర్స్ తో మీటింగ్ లో ఇదే విషయాన్ని ప్రస్తావించగా రోహిత్ శర్మ కెప్టెన్సి మీద టీం లోని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించినట్టు గా తెలుస్తుంది.రెండు మూడు రోజుల్లో ఈ న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…
ఇక దీంతో టి20 వరల్డ్ కప్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అంటూ మీడియాలో విపరీతమైన కథనాలు కూడా వస్తున్నాయి. దీంతో రోహిత్ శర్మ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.ఇక రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇండివిజువల్ సిరీస్ లు గెలుస్తున్నారు గాని, ఐసీసీ నిర్వహించే ట్రోఫీలు మాత్రం గెలవలేక పోతున్నారు.ఈ సంవత్సరమే డబ్ల్యూటిసి లో ఫైనల్ కి వెళ్లి ఓడిపోయారు, అలాగే వన్డే వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ కి వెళ్లి ఓడిపోయారు.
కనీసం టి20 వరల్డ్ కప్ లో అయిన కప్పు కొట్టి చూపించాలి అని రోహిత్ శర్మ ధృడ సంకల్పం తో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఆయనకి కెప్టెన్సీ ఇస్తే వరల్డ్ కప్ గెలిచి చూపిస్తాడు అని మరి కొంతమంది సీనియర్ ప్లేయర్లు కూడా అతని మీద మంచి నమ్మకంతో ఉన్నారు…