https://oktelugu.com/

Bandla Ganesh: బండ్ల గణేశ్‌ రౌడీయిజం.. వైరల్‌ వీడియో..

బండ్ల గణేశ్‌ కుమారుడు హీరేశ్‌ రెండు రోజుల క్రితం హీరా గ్రూప్‌ చైర్‌పర్సన్‌తో వివాదం పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా నౌహీరా ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో హీరాషేక్‌ ఇల్లు అమ్మాలని నిర్ణయించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 18, 2024 / 11:38 AM IST

    Bandla Ganesh

    Follow us on

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌.. పరిచయం అక్కరలేదు.. నటుడిగా తెలుగు ఇండస్ట్రీల్లో కెరీర్‌ ప్రారంభించాడు. కమెడియన్‌గా చాలా సినిమాల్లో నటించాడు. హీరోలకు ఫ్రెండ్‌ క్యారెక్టర్లు చేశాడు. క్రమంగా నిర్మాతగా ఎదిగాడు. టాలీవుడ్‌లో పవన్‌ కళ్యాణ్‌తో బ్లాక్‌బస్టర్‌ సినిమాలు తీశాడు. ఆంధ్రాకు చెందిన బండ్ల గణేశ్‌ తెలంగాణలోనే సెటిల్‌ అయ్యారు. రియల్‌ వ్యాపారం మొదలు పెట్టారు. గణేశ్‌ కుమారుడు హీరేష్‌ వ్యాపారం చూసుకుంటున్నారు.

    నౌరాషేక్‌పై ఫిర్యాదు..
    బండ్ల గణేశ్‌ కుమారుడు హీరేశ్‌ రెండు రోజుల క్రితం హీరా గ్రూప్‌ చైర్‌పర్సన్‌తో వివాదం పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా నౌహీరా ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో హీరాషేక్‌ ఇల్లు అమ్మాలని నిర్ణయించింది. దీంతో గణేశ్‌ కుమారుడు దానిని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాడు. దీంతో రూ.3 కోట్లు చెల్లించాడు. అయితే హీరాగ్రూప్‌ కేసులో ఇల్లును ఈడీ అటాచ్‌ చేసింది. దీంతో హీరాషేక్‌ ఇల్లు ఖాళీ చేయాలని కోరింది. పది మందితో వచ్చి గొడవ పడింది. దీంతో భయపడిన హీరేశ్‌ ఫిలిమ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటిని అమ్ముతానని తనను మోసం చేసిందని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు నౌహీరాషేక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

    తాజాగా మహిళపై దౌర్జన్యం..
    నౌహీరా ఇంటి కొనుగోలు విషయంలో బండ్ల గణేశ్‌ కొడుకు గొడవ కొనసాగుతుండగానే తాజాగా బండ్ల గణేశ్‌ దౌర్జన్యానికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో బండ్ల గణేశ్‌ ముస్లిం మహిళను దుర్భాషలాడుతూ ఆమెపై దర్జన్యం చేయబోయాడు. దీంతో గణేశ్‌ను సముదాయించేందుక అక్కడ ఉన్నవారు యత్నించారు. అయినా వినకుండా మహిళపై దాడిచేసినంత పనిచేశారు. అయితే అక్కడున్నవారు సదరు మహిళను అక్కడి నుంచి పంపించి వేవారు.

    నెట్టింట్లో వైరల్‌…
    ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంటి స్థలం వివాదంలో ముస్లిం మహిళపై బండ్ల గణేశ్‌ రౌడీయిజం చేశాడని, బూతులు తిడుతూ దాడికి యత్నించాడని పేర్కొంటూ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మహిళపై దౌర్జన్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ అనిపించుకున్నాడు.. కొంతమంది హీరోలు బండ్ల గణేశ్‌ను దగ్గరకు కూడా రానివ్వరు ఇందుకే.. ఇదేనా నీ ప్రజాపాలన.. మహిళపై దౌర్జన్యం దేనికి సంకేతం.. పొలిటికల్‌ బ్రోకర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.