https://oktelugu.com/

Bandla Ganesh : తెలంగాణ ఎన్నికల వేళ.. ‘బ్లేడ్ బాబ్జీ’ మరో సంచలనం.. ఈసారి అక్కడే పడుకుంటాడట!

బండ్ల వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట వైరల్ అవుతున్నాయి. బండ్లన్న ఓ పొలిటికల్ కమెడియన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2023 / 08:17 PM IST

    Bandla Ganesh

    Follow us on

    Bandla Ganesh : బండ్ల గణేష్ తెలుగు సినీ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు.మధ్యలో రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి… తక్కువ వ్యవధిలోనే అగ్ర నిర్మాతగా ఎదిగారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు. పవన్ దేవుడని.. ఆయనకు వీరభక్తుడునని చెప్పుకోవడంలో ముందుంటారు. మొన్నటికి మొన్న టిడిపికిజై కొట్టారు. చంద్రబాబును పొగడ్తలతో ముంచేత్తారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో సరికొత్త జోష్యం చెబుతున్నారు.

    బండ్ల గణేష్ గత ఎన్నికల ముందే కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సరిగ్గా తెలంగాణ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలోకి వచ్చేస్తుందని జోష్యం చెప్పడం ప్రారంభించారు. అదే జరగకపోతే తాను 7o క్లాక్ బ్లేడుతో కోసుకుంటానని చెప్పి సంచలనం సృష్టించారు. కానీ కాంగ్రెస్ ఘోర పరాజయం తో పత్తా లేకుండా పోయారు. అక్కడినుంచి తనకు రాజకీయాలు పడవని ఇకనుంచి పాలిటిక్స్ కు దూరంగా ఉంటానని ప్రకటించారు.

    అయితే అటు తరువాత జనసేనకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. పవన్ పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తే జనసేన అధికార ప్రతినిధిగా సైతం వ్యవహరించారు. మొన్నటి చంద్రబాబు అరెస్టుతో చాలా బాధను వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ఉద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు కూడా. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలతో మరోసారి రంగంలోకి వచ్చారు. గత ఎన్నికల మాదిరిగానే జోష్యం చెప్పడం ప్రారంభించారు.ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా డిసెంబర్ 9న తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ప్రకటించారు. డిసెంబర్ 7 నుంచి తాను ప్రమాణ స్వీకారం జరిగే ఎల్బీ స్టేడియంలోనే పడుకుంటాని.. మీరు వచ్చి చూడొచ్చని ఓ మీడియా ప్రతినిధితో కామెడీ పంచులు పేల్చారు. దీంతో మరోసారి బండ్ల గణేష్ ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు.

    అయితే బండ్ల గణేష్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికలపై బండ్ల గణేష్ స్పందించారు.కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. తను పక్క కాంగ్రెస్ వాదినని.. గాంధీభవన్ తన పుట్టినిల్లు అని చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 9న రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తారని.. ఏడో తేదీనే తాను ఎల్బీ స్టేడియం కి వెళ్లి దుప్పటి కప్పుకొని పడుకుంటానని తేల్చి చెప్పారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గురించి కూడా వ్యాఖ్యానించారు. తాను పవన్ అభిమానిని అయినా.. ఆయన పార్టీకి మాత్రం తాను మద్దతుగా ఇచ్చేది లేదు అని తెగేసి చెప్పారు. బండ్ల వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట వైరల్ అవుతున్నాయి. బండ్లన్న ఓ పొలిటికల్ కమెడియన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.