Bandi Sanjay NTR: తిట్టిన నోటితోనే పొగిడించుకున్న ఘనత మన జూనియర్ ఎన్టీఆర్ సొంతం. అలా పొగిడించుకోవడానికి అదృష్టం ఉండాలి. ఇదే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నాడు ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే తగులుకున్నాడు. కొమురం భీం పాత్ర పోషించిన జూనియర్ఎన్టీఆర్ పాత్ర చిత్రణపై విరుచుకుపడ్డాడు. ‘కొమురం భీంకు రాజమౌళి ముస్లిం టోపీ పెట్టారని.. చరిత్రను వక్రీకరించారని.. థియేటర్లను తగులబెడుతామని ’ అప్పట్లో బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చాడు.

ఇప్పుడు అదే బండి సంజయ్.. ఎన్టీఆర్ కు దండాలు పెట్టాడు. శభాష్ అంటూ కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ను పిలిచి చర్చలు జరిపి భోజనం చేయడానికి పిలవడంతో ఆయనను ఎదుర్కోవడానికి గేటు వద్దకు వచ్చి మరీ బండి సంజయ్ చేతిలో చేయి వేశాడు. పాత పగలన్నీ మరిచిపోయి దండాలు పెట్టాడు.
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు బండి సంజయ్ .. మూవీని అడ్డుకుంటామని హెచ్చరించిన వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. నాడు హెచ్చరించి.. నేడు దండాలు ఎలా పెడుతున్నావని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. రాజకీయాల కోసం నేతలు ఎంతకైనా దిగజారుతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అవసరార్థం రాజకీయాలు చేస్తారా? అంటూ మండిపడుతున్నారు.
ఆర్ఆర్ఆర్ లో ముస్లిం గెటప్ వేశాడని ఎన్టీఆర్ ను తిట్టిన బండి..ఇప్పుడే ఎన్టీఆర్ ను ఆహ్వానించిన పిక్ ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. తిట్టిన వారితోనే పొగిడించుకున్న ఘనత యంగ్ టైగర్ సొంతం అంటూ ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. రాజకీయ నేతలు రంగులు మార్చుకున్నా.. ఎన్టీఆర్ మాత్రం తన కృషి పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారని కొనియాడుతున్నారు. అలాంటి తారలపై మాట్లాడేముందు జాగ్రత్త వహించాలని హితవు పలుకుతున్నారు.