https://oktelugu.com/

Bandi Sanjay : కేసీఆర్ కనిపించడం లేదు.. మాకు కేటీఆర్ పైనే డౌట్ : బండి సంజయ్ సంచలన కామెంట్స్

కేసీఆర్ గారితో ప్రెస్మీట్ పెట్టించండి. అప్పుడే ఆయన క్షేమంగా ఉన్నారని మేం నమ్ముతామని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇవే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Written By:
  • NARESH
  • , Updated On : October 4, 2023 / 07:38 PM IST

    kcr bandi sanjay

    Follow us on

    Bandi Sanjay : తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. 15 రోజులుగా కేసీఆర్ కు జ్వరం, దగ్గు అంటూ చూపించడం లేదని.. అసలు కేసీఆర్ కు ఏమైందోనన్న ఆందోళన తెలంగాణ ప్రజానీకంలో ఉందంటూ బాంబు పేల్చారు.

    కేసీఆర్ 15 రోజులుగా కనిపించడంలేదని.. తమకు ఏదో అనుమానం కలుగుతోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సందేహం వ్యక్తం చేశారు. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కేటీఆర్ కు ఉందన్నారు. కేసీఆర్ ను ఏదో చేసి ఉంటారని తాను అనుకోవడం లేదని.. కొడుకు పెట్టే టార్చర్ తో బయటకు రావడం లేదా? అన్నది అనుమానంగా ఉందన్నారు.

    ప్రధాని మోడీ తాజాగా చేసిన వ్యాఖ్యలకు కనీసం కౌంటర్ ఇవ్వడానికి అయినా కేసీఆర్ ను బయటకు తీసుకురావాలని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్‌ను కేటీఆర్ ఏమైనా చేసిండా? ఏమైనా ఇబ్బంది పెడుతుండా? ఎందుకంటే ఆయన కేసీఆర్ మా సీఎం. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది.

    కేసీఆర్ గారితో ప్రెస్మీట్ పెట్టించండి. ఎందుకంటే ఆయన మా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రెస్ మీట్ పెడితేనే అప్పుడే ఆయన క్షేమంగా ఉన్నారని మేం నమ్ముతామని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇవే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.