BAN vs NED : ప్రపంచ కప్ లో మరో సంచలనం…పెద్ద జట్లకు షాకిస్తున్న ఈ చిన్న జట్టు…

సౌతాఫ్రికా లాంటి ఒక పెద్ద జట్టుని కూడా ఓడించగలిగారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ టీంలో నుండి ప్రతి ఒక్కరూ గెలుస్తామనే ఆశతో ఆడుతున్నారు.

Written By: NARESH, Updated On : October 29, 2023 8:51 am
Follow us on

BAN vs NED : వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్ కి బంగ్లాదేశ్ కి మధ్య జరిగిన మ్యాచులో నెదర్లాండ్ టీమ్ ఘన విజయాన్ని సాధించింది. ఇక ఈ విజయంతో నెదర్లాండ్ టీం ఈ వరల్డ్ కప్ లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.ఇక నెదర్లాండ్ టీమ్ ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ టోర్నీ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి మ్యాచ్ లో కూడా వాళ్ళు ట్రై టు లెవెల్ బెస్ట్ అన్న మాదిరిగా వాళ్ల పూర్తి ఎఫర్ట్ ని మ్యాచ్ కోసం పెట్టి ఆడుతున్నారు. అందులో భాగంగానే సౌతాఫ్రికా లాంటి ఒక పెద్ద జట్టుని కూడా ఓడించగలిగారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ టీంలో నుండి ప్రతి ఒక్కరూ గెలుస్తామనే ఆశతో ఆడుతున్నారు.

నిజానికి వాళ్లు వరల్డ్ కప్ లో ఆడటానికి డైరెక్ట్ గా క్వాలిఫై ఏం అవలేదు. క్వాలిఫైర్ మ్యాచెస్ ఆడి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు వాళ్ళు వరల్డ్ కప్ లోకి అడుగు పెట్టారు. ముఖ్యంగా వెస్టిండీస్ లాంటి ఒక పెద్ద జట్టుని ఓడించి వాళ్లు వరల్డ్ కప్ ఆడడానికి వచ్చారు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే వెస్టిండీస్ టీం వరల్డ్ కప్ స్టార్ట్ అయిన మొదటి రెండు సీజన్ లలో వరుసగా రెండుసార్లు టైటిల్ నెగ్గి ముడోవసారి ఫైనల్ కి వచ్చి ఇండియా చేతిలో ఓడిపోయింది.

అలాంటి స్ట్రాంగ్ టీం ని ఓడించి వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టడం అంటే నెదర్లాండ్ టీంలో ఉన్న వాళ్ళ టీం స్పిరిట్ మనం అర్థం చేసుకోవచ్చు.ఇక బంగ్లాదేశ్ మీద ఆడిన మ్యాచ్ లో వాళ్ల కెప్టెన్ ఎడ్వర్డ్స్ ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. దానివల్లే నెదర్లాండ్ టీమ్ 229 పరుగులు చేయగలిగింది. ఇక 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీం మొదట్లోనే చతికలబడింది…

దాంతో నెదర్లాండ్ టీం బౌలర్స్ ముందు ఆ టీమ్ బ్యాట్స్ మెన్స్ తేలిపోయారు.ఏ మాత్రం నెదర్లాండ్ బౌలర్లను ఎదుర్కోలేక వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పెవిలియన్ చేరారు.ఇక ఈ క్రమంలో బంగ్లాదేశ్ టీం 42వ రెండో ఓవర్ రెండో బాల్ కే 142 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక నెదర్లాండ్ బౌలర్లలో మికిరాన్ 4 వికెట్లు తీసి బంగ్లాదేశ్ టీమ్ ని కోలుకోవాలని దెబ్బ కొట్టాడు. దాంతో నెదర్లాండ్ టీమ్ ఈ టోర్నీలో రెండో విజయాన్ని అందుకుంది…