Ban on Electricity Purchase: కేంద్రంతో పెట్టుకుంటే ఏమవుతుందిలే అని తోకజాడించే రాష్ట్రాలకు అదును చూసి దెబ్బకొడుతోంది మోడీ సర్కార్. జాతీయ వనరులను అప్పనంగా ఇవ్వకుండా మోకాలడ్డుతోంది.వాటిపై సర్వాధికారాలు ఉండడంతో కేంద్రానిది ఆడింది ఆట పాడింది పాటగా మారుతోంది. దేశంలోనే 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఘనంగా చాటుకున్న కేసీఆర్ కు ఒక్కరోజులోనే దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. తమతో పెట్టుకుంటే చీమ్మి చీకట్లు ఎదుర్కోవాలని హెచ్చరికలు పంపింది.

తెలంగాణకే కాదు.. ఏపీ సహా దేశంలోని 13 రాష్ట్రాలకు కేంద్రం ‘కరెంట్’ షాక్ ఇచ్చింది. తమ రాష్ట్రాల్లో బొగ్గు గనులు ఉండి.. కరెంట్ డిస్కంలకు బిల్లులు కట్టక నష్టాల్లో నింపుతున్న రాష్ట్రాలకు కర్రు కాల్చి వాతపెట్టింది. ఈ పరిణామంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి విద్యుత్ కోతలు తప్పేలా లేవు. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన షాక్ తో రాష్ట్రాలు బతిమిలాడుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.
Also Read: Dolo 650: డోలో-650 సూచించాలని డాక్టర్లకు రూ.1000 కోట్ల ముడుపులు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-కేంద్రం ఏం చేసింది?
తెలంగాణ, ఏపీ సహా దేశంలోని 13 రాష్ట్రాలు ఎక్స్చేంజీల్లో కరెంట్ కొనకుండా కేంద్రం నిషేధం విధించింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించని ఫలితంగా ఈ నిర్ణయం తీసుకుంది. పవర్ ఎక్స్చేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంట్ కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధిస్తూ షాక్ ఇచ్చింది.
-కేంద్రం ‘షాక్’తో రాష్ట్రాలకు ఏమవుతుంది?
కేంద్రం విధించిన నిషేధంతో తెలుగు రాష్ట్రాలు సహా మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్ ఘడ్, జమ్మూకశ్మీర్, బీహార్, ఝార్ఖండ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల డిస్కంలు ఉన్నాయి. నిషేధం వల్ల తలెత్తే లోటు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా విద్యుత్ కొనుగోలు.. మిగులు విద్యుత్ అమ్మకాలు నిలిచిపోతాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కరెంట్ కొరత ఏర్పడి కోతలు విధించే అవకాశాలు ఉంటాయి.

-పేరుకుపోయిన బకాయిలు
కేంద్రం ఎల్.పీఎస్ నిబంధనలు రూపొందించింది. ఇందులో డిస్కంలకు సరఫరా చేసే విద్యుత్.. చెల్లించాల్సిన బిల్లుల మొత్తాలను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఎప్పటికప్పుడు పోర్టల్ లో అప్ లోడ్ చేసే విధానం తీసుకొచ్చింది. బకాయిలను వెంటనే రాష్ట్రాలు కట్టేయాలి. అలా కట్టకపోవడంతో డిస్కంల వద్ద రాష్ట్రాలు చెల్లించే అప్పులు కుప్పగా మారాయి. విద్యుత్ సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
-గగ్గోలు పెడుతున్న రాష్ట్రాలు
కేంద్రం ఇచ్చిన షాక్ తో రాష్ట్రాలు గగ్గోలుపెడుతున్నాయి. ఏపీకి రోజుకు 10-15 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. తెలంగాణలో 2వేల మెగావాట్ల దాకా ఎక్స్చేంజీలో కొంటున్నాయి. కేంద్రం నిషేధంతో తెలంగాణకు విద్యుత్ కోతలు తప్పవు. దీంతో వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరా తగ్గించడానికి డిస్కంలు రెడీ అయ్యాయి. సమస్య పరిష్కారం కాకపోతే మరింత కోతలు తప్పవు.
ఇలా కేసీఆర్ తన రాష్ట్రానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నానని చెప్పుకున్న రెండు రోజుల్లో కేంద్రం షాకిచ్చింది. పనిలో పనిగా అన్ని రాష్ట్రాలకు దీన్ని వర్తింప చేసింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకుండా ఏదో ఉద్దరించేలా తామే ప్రజలకు ఉచితంగా విద్యుత్ ను ఇస్తున్నామన్న రాష్ట్రాలకు కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. ఈ పరిణామం ముఖ్యంగా కేసీఆర్ కు, ఏపీకి శరాఘాతంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read:Vijayashanthi BJP: ఆఖరుకు బీజేపీలోనూ ‘రాములమ్మ’ ఇమడలేకపోయిందే? లోపం ఎక్కడబ్బా?
[…] […]
[…] […]