Homeఎంటర్టైన్మెంట్Balakrishna vs Akkineni : బాలయ్య పిచ్చి మార్క్ అదంతే: ఆ బ్లడ్ బ్రీడ్ ప్రసంగాలు...

Balakrishna vs Akkineni : బాలయ్య పిచ్చి మార్క్ అదంతే: ఆ బ్లడ్ బ్రీడ్ ప్రసంగాలు అలాగే ఉంటాయి

Balakrishna vs Akkineni : అన్ స్టాప బుల్ రెండు సీజన్లు విజయవంతమయ్యాయి.. అఖండ, వీర సింహారెడ్డి కూడా పర్వా. లేదు ఇలాంటి సమయంలో ఏ నటుడైనా కొంచెం ఒద్దికగా ఉంటాడు.. కానీ అక్కడ ఉన్నది బ్లడ్ బ్రీడ్ బాలయ్య కదా! వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలయ్య కదా! ఆడది కనిపిస్తే కన్ను కొట్టాలి లేదా కడుపు చేయాలి అనే బాలయ్య కదా! దేశ ప్రధాని పై నోటికొచ్చినట్టు మాట్లాడే బాలయ్య కదా! అలా కాక ఎలా మాట్లాడుతాడు? ఏమాత్రం ఉచ్చం నీచం తెలియదా? ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదా? నాన్సెన్స్ బాలయ్యకు సంస్కారం లేదా? ఇలాంటివి సోషల్ మీడియాలో, వివిధ రకాల సైట్లల్లో వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి.. అక్కినేని, తొక్కినేని ఈ వ్యాఖ్యలు నిన్నటి నుంచి తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.. ఎందుకు బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశాడు అని ఆరా తీస్తే నాగార్జున అంటే పడదు కాబట్టి తనను ఉద్దేశించే ఆ తలతిక్క వ్యాఖ్య చేశాడు అంటున్నారు.. ఇంకా చాలా దూరం వెళ్లి రంగారావు కన్నా ఎన్టీఆర్ గొప్ప నటుడా? అక్కినేని ఎన్టీఆర్ కన్నా ఏం తక్కువ? అనే స్థాయికి విమర్శలు పెరిగాయి.

అసలు బాలయ్యను తప్పు పట్టడమే పెద్ద తప్పు.. నిజమే బాలయ్య మెంటల్ కేస్.. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంత పరిపక్వంగా మాట్లాడాలో తెలిస్తే అతను బాలయ్య ఎందుకు అవుతాడు? అసలు తన మెంటల్ స్టేచర్ సరిగా ఉంటే ఏపీకి సీఎం కావాల్సినవాడు.. అన్నింటికీ మించి ఎన్టీఆర్ వారసుడు… “ఆయనే ఉంటే ఈ తెల్ల చీర నాకెందుకు” అనే సామెత లాగా… బాలయ్యకు అంత సీనే ఉంటే చంద్రబాబు సీఎం ఎందుకు అవుతాడు.. అదంతే అసలు ఆ సినిమాకు సక్సెస్ మీటే శుద్ధ దండగ.. ఆయన సక్సెస్ మీట్స్ అంటే వాడు అద్భుతం, వీడు అద్భుతం అని ఒకరిని ఒకరు పొగిడేసుకోవడమే తప్ప… అక్కడికి వచ్చే వాళ్లకూ తెలుసు బాలయ్య మాట్లాడే తీరు ఎలా ఉంటుందో..

అయితేనే ప్రజల్లో ఉన్నప్పుడు కూడా ఎలా ఏం మాట్లాడాలో తెలియకపోతే ఎలా? అంతటి ప్రొఫైల్ ఉన్న వ్యక్తి ఇలాగానే ఉండటం అని అందరూ అంటున్నారు. మరికొందరేమో తను అలాగే ఉన్నా చూసే వాళ్ళు చూస్తేనే ఉన్నారుగా… జనం ఓట్లు వేస్తూనే ఉన్నారుగా… బ్లడ్, బ్రీడ్, గాడిద గుడ్డు అని పిచ్చి ప్రేలాపనలు, హనీ రోస్ తో చేతిలో చేయి వేసుకొని వైన్ తాగినా చెల్లుబాటు అవుతూనే ఉంది కదా… అతడు ప్రసంగిస్తే “మా నాన్నగారు” అప్పట్లో సగం సేపు అదే సుత్తి.. అదే స్తుతి.. ఏం జనం వినడం లేదా? చూడటం లేదా? బాలయ్య మార్క్ అలానే ఉంటుంది.

అక్కినేనిని తొక్కినేని అనే దగ్గరకు వద్దాం. బాలయ్య తన మార్క్ పిచ్చి మాటల ఫ్లోలో అలా అన్నాడు.. తప్ప పర్టికులర్గా అక్కినేని నాగేశ్వరరావునో, నాగార్జుననో ఉద్దేశించి చేసిన విమర్శలా ఏమీ లేదు. ఎవరో వ్యక్తి షూటింగ్ సెట్లో ఉంటే ఏవేవో ముచ్చట్లు వస్తూ ఉంటాయి.. రంగారావు, అక్కినేని, తొక్కినేని గట్రా అన్ని మాట్లాడతాడు అని ఆ వ్యక్తిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.. అంతే తప్ప అక్కడ అక్కినేనిని కించపరిచే సంకల్పం ఏదీ కనిపించలేదు. ఒకవేళ ఆ ఉద్దేశం ఉంటే నేరుగా కామెంట్స్ చేస్తాడు.. ప్రస్తుతానికి బాలయ్యకు నాగర్జునకు టరమ్స్ బాగోలేవు.. ఈ లోకంలో ఒకరంటే ఒకరు గిట్టని వాళ్ళు కోట్లల్లో ఉంటారు. అలాగని బాలయ్య, నాగార్జున బద్ధ శత్రువులు కాదు. రేపొద్దున అవసరమైతే ప్లాస్టిక్ ఆప్యాయతలు కురిపించుకుంటూ కౌగిలించుకుంటారు.. మధ్యలో మనం ఎందుకు గోక్కోవడం? పబ్లిక్ డొమైన్ తొక్కా తోలు అని మాట్లాడకండి.. అక్కినేని, తొక్కినేని అనే పదాల ఫ్లో వచ్చేది కూడా ఇలాగే.. బాలయ్య తరహా తెలుగు తెలుసు కాబట్టి ఆచితూచి మాట్లాడిన నాగార్జున కూడా లైట్ గా నవ్వుకొని వదిలేసి ఉంటాడు.. కానీ ఇదే సమయంలో నాగార్జున కొడుకులకు పరిణతి తక్కువ. అందుకే ఇలా తొందరపడ్డారు. కొద్ది రోజుల్లో ఇది చల్లారిపోతుంది. కానీ అభిమానులు అలా కాదు కదా… చించుకుంటారు. పోటాపోటీగా సోషల్ మీడియాలో ప్రకటనలు చేసుకుంటారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular