Baby Theatrical Trailer : రాబోయే సినిమాలలో యూత్ ని ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి చిత్రం ‘బేబీ’. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో, విరాజ్ అశ్విన్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించిన వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా నటించింది. టీజర్ , పాటలు బాగా క్లిక్ అవ్వడం తో యూత్ ఈ చిత్రం పై అంచనాలు భారీ గా పెంచుకున్నారు.
ఇక రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ లో హీరోయిన్ నోట్లో బ్లేడ్ పెట్టుకొని, హీరో గెడ్డం గీకే విధంగా ఉన్నటువంటి ఫోజు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇప్పుడు కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
‘కలర్ ఫోటో’ లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ చిత్రాన్ని నిర్మించిన సాయి రాజేష్, ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం కూడా వహించాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ ని చూస్తూ ఉంటే ఇది ఒక ట్రైయాంగులర్ లవ్ స్టోరీ అనే విషయం అర్థం అవుతుంది. ముందుగా ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య ప్రేమించుకుంటారు. ఆ తర్వాత ఆమె పెద్ద చదువు కోసం ఒక మోడరన్ కాలేజీ లో చేరుతుంది. కాలేజీ లో చేరకముందు వరకు చాలా డీ గ్లామర్ గా కనిపించిన వైష్ణవి చైతన్య, కాలేజీ లో కొత్త స్నేహితుల పరిచయం కారణంగా మోడరన్ లుక్ కి మారుతుంది. ఇక అదే కాలేజీ లో విరాజ్ అశ్విన్ కూడా పరిచయమవుతాడు.
అతనితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆనంద్ దేవరకొండ తో మాట్లాడడం బాగా తగ్గించేస్తుంది. విరాజ్ అశ్విన్ కూడా వైష్ణవి ని ప్రేమిస్తున్నాడు అనే విషయం తెలుసుకున్న తర్వాత ఆమె ఎవరిని చివరికి పెళ్లి చేసుకుంటుంది అనేది స్టోరీ అని ట్రైలర్ చూసిన తర్వాత అర్థం అయ్యింది. చూస్తూ ఉంటే ఈ చిత్రం కచ్చితంగా సూపర్ హిట్ కొట్టేలాగానే ఉంది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉంటే చాలు, టాలీవుడ్ కి మరో భారీ హిట్ దక్కినట్టే అనుకోవచ్చు.