https://oktelugu.com/

Baby heroine Vaishnavi Chaitanya : బాత్ రూమ్ లోనే ఆ పని చేయడం చూసి అమ్మ బాధపడింది… బేబీ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

వాష్ రూమ్ కోసం మీ కారవాన్ వాడుకోవచ్చా అని ఒక పెద్ద నటిని అడిగితే ఆమె కోప్పడ్డారు. బాగా తిట్టారు. ఈ సంఘటనలు తనలో కసి పెంచినట్లు వైష్ణవి చెప్పుకొచ్చారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2023 / 12:16 PM IST

    Baby heroine Vaishnavi Chaitanya

    Follow us on

    Baby heroine Vaishnavi Chaitanya : ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది వైష్ణవి చైతన్య. బేబీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా హిట్ క్రెడిట్ మొత్తం ఆమెకే దక్కింది. తెలుగు అమ్మాయి బోల్డ్ రోల్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైష్ణవి పేరు పరిశ్రమలో మారుమ్రోగుతుంది. బేబీ చిత్రాన్ని ట్రైయాంగిల్ లవ్ డ్రామాగా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ హీరోలుగా నటించారు. రెండు వారాల పాటు నిరవధికంగా ఆడిన బేబీ రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.

    వైష్ణవి చైతన్యకు ఆఫర్స్ వెల్లువెత్తున్నట్లు సమాచారం. కాగా పరిశ్రమలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిన్నప్పటి నుండే కుటుంబ బాధ్యత తీసుకున్నట్లు వైష్ణవి చైతన్య చెప్పారు. పదో తరగతి చదివే రోజుల్లోనే సంపాదన మొదలుపెట్టాను. నాకు తెలిసింది డాన్స్ ఒక్కటే. పెళ్లిళ్లు, బర్త్ డే ఫంక్షన్స్ లో డాన్స్ చేసేదాన్ని. అలా ఒక ఈవెంట్ కి రూ. 700 రూపాయలు ఇచ్చేవారు. ఆ డబ్బుతో కుటుంబ అవసరాలు తీరేవని వైష్ణవి చెప్పారు.

    చిన్న ఆర్టిస్ట్స్ కి కారవాన్ ఉండదు. బాత్ రూమ్ లోనే కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేసుకోవాలి. ఒకరోజు వాష్ రూమ్ లో బట్టలు మార్చుకోవడం చూసి అమ్మ చాలా బాధపడింది. ఏడ్చేసి మనకు అవసరమా. యాక్టింగ్ వద్దు వదిలేయ్ అన్నట్లు మాట్లాడింది. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించాలని ఫిక్స్ అయ్యానని వైష్ణవి అన్నారు. ఈ పిల్ల ఏం చేయలేదు. తన వల్ల ఏం కాదని అంటుంటే… మనసుకు బాధ కలిగేది. అలాంటి మాటలు పట్టించుకోకూడదని అనుకునేదాన్ని.

    వాష్ రూమ్ కోసం మీ కారవాన్ వాడుకోవచ్చా అని ఒక పెద్ద నటిని అడిగితే ఆమె కోప్పడ్డారు. బాగా తిట్టారు. ఈ సంఘటనలు తనలో కసి పెంచినట్లు వైష్ణవి చెప్పుకొచ్చారు. నెక్స్ట్ వైష్ణవి చైతన్య అల్లు శిరీష్ కి జంటగా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. దర్శకుడు సాయి రాజేష్ బేబీ చిత్రంలో నటించేందుకు మూడు సినిమాలు ఆఫర్ చేశాడట. బేబీ ఫలితంతో సంబంధం లేకుండా మరో మూడు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని ప్రామిస్ చేశాడట.