Ayodhya Ram Mandir : అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయం జనవరి 24 తర్వాత భక్తులకు అందుబాటు

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయం జనవరి 24 తర్వాత భక్తులకు అందుబాటులోకి రానుంది. అయోధ్య రామాలయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : September 29, 2023 6:43 pm

Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయం.. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం. అది త్వరలోనే ఆసన్నమవుతుంది. భక్తులు అయోధ్య రామాలయాన్ని దర్శించుకునే సమయం ఆసన్నదమైంది. గ్రౌండ్ ప్లోర్ డిసెంబర్ కల్లా పూర్తిగా సిద్ధమవుతుంది. జనవరి 14 నుంచి పూజలు చేస్తారు. దేవతామూర్తి ప్రాణప్రతిష్ట జనవరి 22 జరుగుతుందని తెలుస్తోంది. నిర్మాణం 2020 ఆగస్టు 5న ప్రారంభమై మొత్తం మూడు ఫ్లోర్లు పూర్తయ్యేసరికి 2024 డిసెంబర్ అవుతుంది. ఆలయ నిర్మాణానికి సంబంధించి డౌట్లు చాలా మందికి ఉండేది. కానీ దీన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.

1990లో మలిదశ ఉద్యమం మొదలైనప్పుడు ఎవరికి కూడా ఆత్మ విశ్వాసం లేదు. రాముడు పుట్టిన ప్రదేశంలో ఆలయం నిర్మిస్తారని ఎవ్వరూ నమ్మలేదు. ఇదంతా బీజేపీ ఎన్నికల స్టంట్ అని కొట్టిపారేశారు. దీన్ని కాంగ్రెస్ తోపాటు అన్ని పార్టీలు ఎద్దేవా చేశాయి. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఒకే ఒక్కడు మోడీ. కాదని ఎవరూ చెప్పలేరు. ఈ ఘనత మాత్రం మోడీదే.

రెండోది దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ ఆలయ నిర్మాణానికి యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేసి భక్తుల నుంచి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీనికి దేశవ్యాప్తంగా భక్తులు స్పందించి ఏకంగా 3500 కోట్ల రూపాయలు డొనేషన్లు వచ్చాయి. ఇప్పటికే 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తం 1800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.. దీని కోసం 15 మందితో కూడిన ట్రస్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి 2వేల మంది రుషులు, మునులు, పీఠాధిపతులు , కరసేవకుల కుటుంబాలు మొత్తం 10వేల మంది ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయం జనవరి 24 తర్వాత భక్తులకు అందుబాటులోకి రానుంది. అయోధ్య రామాలయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.