Ayodhya Ram Mandir : అయోధ్య.. ఈ పేరు వినగానే ప్రతీ హిందువు గుండెలో జైశ్రీరాం అని తెలియకుండానే స్పురిస్తుంది. అంతటి మహత్తరం, మహత్యం అయోధ్యకు ఉంది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పుణ్యస్థలం అది. అయోధ్య వివాదానికి ముగింపు పలికిన ప్రధాని నరేంద్రమోదీ అక్కడ రామాలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2014, జనవరిలో ఆలయం ప్రారంభించేందుకు చకచకా పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అద్భుతమైన నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను ఆలయ నిర్మాణ ట్రస్టు విడుదల చేసింది. ఈ ఫొటోలను చూసి భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు.
రామ నగరం..
అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న ఆలయ ప్రాంతానికి రామమందిర నిర్మాణ ట్రస్టు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రామనగరంగా నామకరణం చేసింది. ఈ నగరంలో పురుషోత్తముడు శ్రీరామచంద్రుడి ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు. ఈ ఆలయం మరో మూడు నెలల్లో ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఆలయ సింహద్వారం ముందు టన్నెల్ అని పేరు పెట్టిన సొరంగం నిర్మించారు. ఈ ద్వారం నుంచే భక్తులు తమ దేవుడి దర్శనానికి వెళతారు. అద్భుతమైన, అతీంద్రియ శిల్పం సింహద్వారంపై స్పష్టంగా కనిపిస్తుంది.
అద్భుతమైన నిర్మాణం..
తాజాగా విడుదల చేసిన ఫొటోల్లో రామమందిర పరిషత్ నిర్మాణం మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో కూర్చుని చూస్తేంటేనే తెలియకుండానే తన్మయం పొందుతాం. అంతటి అద్భుతంగా నిర్మాణం జరుగుతోంది. ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నారు. ఆలయం చుట్టూ కోట, సింహ ద్వారం ముందు నిర్మిస్తున్న సొరంగంపై పైకప్పు వేసే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
రంగ మండపం..
తాజా ఫొటోల్లో రంగ మండప కనిపిస్తుంది. ఈ మండపాన్ని రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ నుంచి చెక్కిన రాళ్లను ఏర్పాటు చేశారు. ఎంత అందంగా చెక్కారో స్పష్టంగా కనిపిస్తుంది.
ఆకర్షణీయంగా రాముడి సింహాసనం..
ఇక రాముడు జనవరి 22న ఆసీనుడయ్యే సింహాసనాన్ని కూడా అద్భుతంగా నిర్మించారు. గర్భాలయంలో ఉన్న ఈ నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ప్రధానమంత్రి మోదీ.. శ్రీరాముడిని అతిధేయ పాత్రలో ఇక్కడ ప్రతిష్టిస్తారు.
మూడు దశల్లో నిర్మాణం..
అయోధ్యలో నిర్మించే ఆలయ నిర్మాణం మూడు దశల్లో పూర్తవుతుంది, ఇందులో మొదటి దశ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. రెండవ దశ 2024 డిసెంబర్ నాటికి పూర్తిచేస్తారు. మూడో దశ నిర్మాణాన్ని 2025, డిసెంబర్ వరకు పూర్తిచేసేలా ప్రణాళిక రూఒపందించారు. ఇదిలా ఉంటే రెండో దశ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆలయంలో మరే విశేషం ఏమిటంటే.. భక్తులు రాముని చుట్టూ ప్రదక్షిణ చేసేలా ప్రత్యేక నిర్మాణం చేస్తున్నారు.