https://oktelugu.com/

AUS vs AFG : అద్భుత మ్యాచ్.. సెల్యూట్ అంతే.. కాళ్లు కదపకుండా ఈ ఒక్కడు ఓటమి నుంచి ఆస్ట్రేలియాను గెలిపించాడు

మ్యాచ్ చూస్తున్నంత సేపు రోమాలు నిక్కబొడుచుకున్నాయి అసలు ఏమన్న కొట్టిండా అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించాడు...  సెల్యూట్ మాక్స్ వెల్...

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2023 / 10:30 PM IST
    Follow us on

    AUS vs AFG : వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి 291 పరుగులు చేసింది. ఇక అందులో భాగంగానే ఆఫ్గనిస్తాన్ ప్లేయర్ అయిన ఇబ్రహీం జద్రాన్ సెంచరీ చేసి ఆ టీంకు గౌరవప్రదమైన స్కోర్ ని అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు అనే చెప్పాలి.

    ఇక ఆ తర్వాత 292 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియన్ టీంకి మొదట్లోనే వరుసగా వికెట్లు కోల్పోవడం తో ఒక భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి.దాంతో ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఈ మ్యాచ్ ని ఆల్మోస్ట్ కైవసం చేసుకుంది అనే స్టేజ్ లోకి వచ్చేసింది. అదే టైంలో 91 పరుగుల వద్ద ఏడు వికెట్లను కోల్పోయిన ఆస్ట్రేలియా టీం 150 పరుగులకు ఆలౌట్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తరు మారు చేస్తూ ఆస్ట్రేలియన్ హార్డ్ హీట్టర్ అయిన మాక్స్ వెల్ మాత్రం బ్యాట్ తో తన విశ్వరూపాన్ని చూపించాడు. అద్భుతమైన సెంచరీ తో ఈ వరల్డ్ కప్ లో ఎప్పుడు లేని విధంగా చెలరేగి ఆడాడు ఇక దానికి తోడుగా ప్యాట్ కమ్మిన్స్ అతనికి స్ట్రైక్ రొటేట్ చేస్తూ నాన్ స్ట్రైక్ లో ఉండి అతనికి హెల్ప్ చేశాడు.

    ఇక మ్యాక్స్ వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఆయన ఒక్కడిని మినహాయిస్తే ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్స్ ఎవ్వరూ కూడా మంచి పర్ఫామెన్స్ ఇవ్వలేదు.ఇక అఫ్గాన్ ప్లేయర్లు బౌలింగ్ అద్భుతంగా చేసినప్పటికీ మాక్స్ వెల్ గ్రౌండ్ నలుమూలాల అద్భుతమైన షాట్స్ కొడుతూ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే సెమీఫైనల్ కి అఫీషియల్ గా క్వాలిఫై అవుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాక్స్ వెల్ చెలరేగి ఆడడమే కాకుండా ఆస్ట్రేలియన్ టీం కి ఒక అద్భుతమైన విజయాన్ని కూడా అందించాడు. 46 వ ఓవర్ 5 వ బాల్ కే ఆస్ట్రేలియా టీమ్ 293 పరుగులు చేసింది…ఇక దీంతో ఆస్ట్రేలియా సెమీస్ కి క్వాలిఫై అయింది. ఆఫ్ఘనిస్తాన్ కి మాత్రం ఇంకొక మ్యాచ్ మిగిలి ఉంది కాబట్టి ఆ మ్యాచ్ కూడా ఆడితే గాని అఫ్గాన్ టీమ్ సెమీస్ కి వస్తుందా లేదా అనే విషయం మీద క్లారిటీ రాదు…

    పసికూనలు అయిన ఆఫ్ఘనిస్తాన్ టీమ్ మీద మ్యాక్స్ వెల్ చేసిన విధ్వంసానికి అందరు చేతులు కట్టుకొని చూడడం తప్ప ఏం చేయలేకపోయారు.తనదైన రోజున ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్ మాక్స్ వెల్…ఇక ఇప్పుడు మాక్స్ వెల్ లాగా ఇంత హార్డ్ హిట్టింగ్ చేసే ప్లేయర్ మరొకరు లేరు అనే విధంగా ఆయన ఆట సాగడం అనేది ఆయన లోని ప్రతిభ గల ప్లేయర్ కి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక ఒంటి చేత్తో మ్యాచ్ మొత్తాన్ని ఒక్కడే తన భుజాలపైన మోస్తూ విజయ తీరాలకు చేర్చడం అంటే మామూలు విషయం కాదు…ఆయన నిజంగా ఒక వారియర్ లా ఫైట్ చేసి అఫ్గాన్ చేతిలోకి వెళ్లిన మ్యాచ్ ని లాక్కున్నాడు…

    ఈ మొత్తం మ్యాచ్ లో మాక్స్ వెల్ 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్స్ లతో 201 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి ఆస్ట్రేలియా కి ఒక పెద్ద విజయాన్ని అందించాడు.మాక్స్ వెల్ సిక్స్ తో తన డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఇప్పటి వరకు ఏ వరల్డ్ కప్ లో సాధ్యం కానీ ఎవరూ ఆడని ఒక ఇన్నింగ్స్ ఇది…ఎవ్వరూ క్రియేట్ చేయలేని ఒక చరిత్ర ఇది,మ్యాచ్ చూస్తున్నంత సేపు రోమాలు నిక్కబొడుచుకున్నాయి అసలు ఏమన్న కొట్టిండా అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించాడు…  సెల్యూట్ మాక్స్ వెల్…