
“మంచి యుద్ధం, చెడ్డ శాంతి ఉండవు” అంటాడు ప్రఖ్యాత రచయిత బెంజిమెన్ ఫ్రాంక్లిన్.. కానీ రాజ్యకాంక్షతో తహతలాడే దేశాధినేతలకు ఇవేవీ పట్టవు. ప్రస్తుతం జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా అలాంటిదే.. గతంలో అమెరికా యుద్ధాలు చేసేది.. ఆ యుద్ధం వల్ల ఎంత నష్టమో దానికి తర్వాత కాని అర్థం కాలేదు. రష్యా కూడా ఇప్పుడు అవే నష్టాలను చవిచూస్తోంది. భారత్ పాకిస్తాన్ యుద్ధం వల్ల ఆ యుద్ధం తాలూకు నష్టాన్ని పూడ్చుకునేందుకు కొన్ని సంవత్సరాలపాటు దేశ ప్రజలు ప్రత్యేక పన్ను చెల్లించాల్సి వచ్చింది. యుద్ధం తాలూకు నష్టాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పటి తరానికి తక్కువ తెలుసు. అంటే ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ పై యుద్దాల వల్ల ప్రపంచం పై కొంతమేర ప్రభావం పడింది. కానీ మొదటి, రెండు ప్రపంచ యుద్ధాలు ఈ భూగోళం మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వెయ్యికి పైగా యుద్ధ ఖైదీలను తీసుకెళ్తూ ఒక మునిగిపోయింది. 81 సంవత్సరాల తర్వాత ఆ నౌక ఆచూకీని కనుగొన్నారు. ఈ ఘటనలో 979 మంది ఆస్ట్రేలియా వాసులు చనిపోయారు. ఇక మిగతా ఖైదీలు 14 దేశాలకు చెందినవారు.
ఆ వెయ్యి మంది ఖైదీలను తరలిస్తున్న నౌక జపాన్ దేశానికి చెందినది. అయితే సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఫిలిప్పీన్స్ లోని లుజోన్ ద్వీప తీరంలో దక్షిణ చైనా సముద్రంలో నాలుగు వేలకు పైగా మీటర్ల లోతులో మునిగి పోయిన నౌక(ఎస్ ఎస్ మాంటే వీడియో మారు) ఆచూకీ లభించినట్టు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ శనివారం ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆస్ట్రేలియా సమీపంలోని పపువా న్యూ గినియా లో పట్టుబడిన వెయ్యికి పైగా యుద్ద ఖైదీలు, పౌరులతో కూడిన ఓ జపాన్ నౌక 1942 జూన్ 22 అప్పటి జపాన్ ఆక్రమిత హైనాన్ ద్వీపానికి బయలుదేరింది. అయితే, మిత్ర రాజ్యాలకు చెందిన పౌరులను తీసుకెళుతుందన్న విషయం తెలియని అమెరికా జలాంతర్గామి జూలై 1న దాడి చేయడంతో ఈ నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో ఆస్ట్రేలియా దేశానికి చెందిన 979 మంది, 14 దేశాలకు చెందిన 101 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ఆస్ట్రేలియా సముద్ర చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన ఇది..
ఈ ఘటన జరిగిన తర్వాత మునిగి పోయిన నౌక ఆచూకీని కనుగొనాలనే డిమాండ్ మొదలైంది. ఆస్ట్రేలియా రక్షణ శాఖ, పురావస్తు విభాగం, సైలెంట్ వరల్డ్ ఫౌండేషన్ కలిసి… నెదర్లాండ్ కు చెందిన సముద్ర సర్వే సంస్థ “ఫుగ్రో” సాయంతో ప్రత్యేక మిషన్ నిర్వహించాయి. ఆధునిక పరికరాలు ఉపయోగించాయి. ఏళ్ల శ్రమ తర్వాత దక్షిణ చైనా సముద్ర గర్భంలో ఈ నౌక ఆచూకీ లభ్యం అయింది. నౌక ను వెలికి తీసిన తర్వాత ఆసీస్ ప్రధాని ఉద్వేగంగా మాడ్లాడారు. ఇది మా నిబద్దతకి నిదర్శనం అని ప్రకటించారు.