Asia Cup 2022 India vs Pakistan: ప్రపంచకప్ టోర్నీలో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు ఒక సారి తలపడుతాయి. కానీ ఆసియా కప్ షెడ్యూల్ లో రెండు మూడు సార్లు తలపడేలా స్కెచ్ గీశారు. అది గొప్ప ఫలితం ఇచ్చింది. ఎందుకంటే ఈ రెండు దాయాది జట్ల మధ్య ప్రత్యక్ష క్రికెట్ పర్యటనలు లేవు. సో ప్రపంచకప్ వేదికలపై తప్ప ఎక్కడా తలపడవు.

గత ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోయింది. మొదటి రౌండ్ లోనే నిష్క్రమించింది. కానీ ఈ ఆసియా కప్ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసిన టీమిండియా సూపర్4లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ తోనే తలపడుతోంది. ఆదివారం సాయంత్రం 7.30 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది.. దీంతో మరోసారి ఈ బిగ్ ఫైట్ ను చూడాలని రెండు దేశాల ప్రజలే కాదు.. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Serena Williams: తెల్లజాతీయులను మట్టి కరిపించిన నల్ల కలువ
-భారత్ బలమేంటి.? బలహీనత ఏంటి?
పాకిస్తాన్ తో పోలిస్తే భారత జట్టు బౌలింగ్ లో బలహీనంగా కనిపిస్తోంది. బ్యాటింగ్లో ఫర్వాలేదనిపించేలా ఉన్నా.. బౌలింగ్ కు వచ్చేసరికి కొత్త వారు ఆకట్టుకోలేకపోతున్నారు. హాంకాంగ్ ను 38కే ఆలౌట్ చేసింది పాకిస్తాన్ బౌలింగ్ దళం. అదే మన టీమిండియా 151 పరుగులు చేయనిచ్చింది. ఇదే ప్రధాన లోపంగా కనిపిస్తోంది. షాహీన్ ఆఫ్రిది లాంటి స్టార్ బౌలర్ లేకున్నా కూడా పాకిస్తాన్ బౌలింగ్ దళం భీకరంగా ఉంది. భారత జట్టు కూడా ఛేజింగ్ లో తడబడిందంటే అర్థం చేసుకోవచ్చు. హార్ధిక్ పాండ్యా వల్లే భారత్ గెలిచింది కానీ.. లేకుంటే పాకిస్తాన్ బౌలింగ్ ధాటికి మనోళ్లు పరుగులు చేయడానికే తండ్లాడిన పరిస్తితి. రోహిత్, రాహుల్, సూర్యకుమార్ సైతం కొట్టలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ లాంటి టీ20 బౌలర్లు లేకపోవడంతో భువనేశ్వర్ మీదే భారం పడుతోంది. ఇక ఆవేశ్ ఖాన్, అర్షదీప్ లాంటి వారు ఆకట్టుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఈరోజు మార్పులు చేసే అవకాశం ఉంది. రవిచంద్రన్ అశ్విన్ ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బ్యాటింగ్ పరంగా చూస్తే ఓపెనర్ కేఎల్ రాహల్ తేలిపోతున్నాడు. ఇక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో వైదొలగడం టీమిండియా పెద్ద దెబ్బ. అతడి స్థానంలో అక్షర్ పటేల్ ను తీసుకున్నారు. అతడు ఎలా రాణిస్తాడన్నది వేచిచూడాలి. కెప్టెన్ రోహిత్ పరుగులు చేయడానికి తండ్లాడుతున్నాడు. కోహ్లీ ఫాంలోకి రాగా.. సూర్య భీకరంగా ఆడుతున్నాడు. హార్ధిక్ ఫాంలో ఉన్నాడు. ఓపెనర్లు రాణిస్తే పాక్ ను ఓడించడం పెద్ద కష్టం కాదు..

-పాకిస్తాన్ బలంగా..
హాంకాంగ్ ను చిత్తుగా ఓడించి పాకిస్తాన్ బలంగా పుంజుకుంది. టీమిండియాతోనూ హోరాహోరీగా ఫైట్ ఇచ్చింది. బౌలింగ్లో భీకరంగా ఉంది. బ్యాటింగ్ లోనూ బలంగా కనిపిస్తోంది. బలబాలాల పరంగా చూస్తే ఈరోజు పాకిస్తాన్ టీమిండియాకు గట్టి పోటీనిస్తుందని అంటున్నారు. టీమిండియా బౌలింగ్ కనుక గాడిలో పడకుంటే తేడా కొట్టినట్టు కొట్టవచ్చు. బాబర్ ఫాంలో లేడు. రిజ్వాన్, ఫకార్ జమాన్ సహా మిడిల్ ఆర్డర్ రాణిస్తోంది. బౌలింగ్ లో తిరుగులేకుండా ఉంది. సో ఈ రోజు బిగ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది.
-టీమిండియా జట్టు అంచనా
రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, హార్ధిక పాండ్యా, దినేశ్ కార్తిక్/ పంత్, భువనేశ్వర్, అక్షర్ పటేల్, అర్షదీప్, అశ్విన్, చాహల్.
Also Read:Jagan- Amit Shah: అమిత్ షాపై జగన్ కు అంత కోపం ఏంటబ్బా? అసలేంటి కారణం?
[…] Also Read: Asia Cup 2022 India vs Pakistan: ఆసియా కప్: ఇండియా వర్సెస్… […]