Anand Mahindra : అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ కాదేదీ కవితకి అనర్హమని శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు నయా ప్రపంచంలో చాలామంది పనికిరాని వస్తువులతో అద్భుతాలు చేస్తున్నారు. తమ సృజనను నిరూపించుకుంటున్నారు. కొంతమంది అయితే దుమ్ము, ధూళితో కూడా అద్భుతాలు చేస్తున్నారు. కళ్ళు చెదిరిపోయే ఆకృతులను రూపొందిస్తున్నారు. దుమ్ము, ధూళి తో అద్భుతాలు ఏంటి, వాటితో ఆకృతులు రూపొందించడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ మేటర్ చదవండి మీకే అర్థమవుతుంది.
ఆనంద్ మహీంద్రా.. దేశంలోనే పెద్ద కార్పొరేట్ అధిపతుల్లో ఈయనా ఒకరు. థార్ నుంచి ఐటి దాకా అనేక రకాల వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతటి వ్యాపారవేత్త అయినప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నాకు నచ్చిన విషయాలను పంచుకుంటారు. ఆనంద్ మహీంద్రాలో ఆ గుణం వచ్చి చాలామంది ఆయనను సోషల్ మీడియాలో అనుసరిస్తుంటారు. ట్విట్టర్ ఎక్స్ లో ఆయనకు మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. తనకు నచ్చిన ఏ అంశానైనా సరే వెంటనే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. అంతేకాదు క్రీడాకారులకు తన వంతుగా సహాయం చేస్తూ ఉంటారు. తన బ్రాండ్ మహీంద్రా ఉత్పత్తులను కూడా సరికొత్తగా మార్కెటింగ్ చేసుకుంటారు.. అయితే అటువంటి మహేంద్ర తన ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. ఇంతకీ ఆయన పోస్ట్ చేసిన వీడియో ఏంటంటే..
సాధారణంగా మనం వాహనాల మీద దుమ్ముధూళి కనిపిస్తే శుభ్రం చేస్తాం. కానీ కొంతమంది అలా కాదు.. ఆ దుమ్ము ధూళి పై అద్భుతాలు చేయగలరు. తమ చేతులతో రకరకాల చిత్రాలు గీయగలరు. అలాంటి ఒక వీడియోను ఆనంద్ పోస్ట్ చేశారు. అందులో రకరకాల వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో వాహనాలకు పట్టి ఉన్న దుమ్ము ధూళిపై చేతులతో విభిన్నమైన చిత్రాలు చిత్రీకరించారు. క్షణాల వ్యవధిలో వాటిని రూపొందించారు. ఈ వీడియోను ఆనంద్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొంత సమయంలోనే అది తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. వీడియో బాగుందని, అటువంటి చిత్రకారులకు ప్రోత్సాహకాలు అందిస్తే అద్భుతాలు చేయగలరని కితాబు ఇస్తున్నారు. దుమ్ముపై కూడా ఇలాంటి డిజైన్లు గీయవచ్చు అని, అది మీ వీడియో ద్వారా చూస్తున్నామని మరి కొంతమంది వ్యాఖ్యానించారు. ఇలాంటి వీడియోలు పెట్టి సృజనకు కొత్త అర్థం చెబుతున్నారని ఇంకొంతమంది ఆనంద్ ను ప్రశంసించారు. దుమ్ము ధూళి పై డిజైన్లు వేయడం మాములు విషయం కాదని, దానిని మాకు పరిచయం చేసిన మీకు కృతజ్ఞతలు అంటూ మరికొందరు ట్విట్లు చేశారు.
This looks like it’s India? (No shortage of dusty cars here!). What talent. Artists are to be found everywhere. And for true artists, every object in the world is a canvas for their expression. pic.twitter.com/b29GjEktqv
— anand mahindra (@anandmahindra) December 27, 2023