Smartphone Addiction: టెక్నాలజీ పెరిగే కొద్ది ఎన్ని ప్రయోజనాలు ఉంటున్నాయో.. అంతే అనర్థాలు ఉంటున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ చౌకగా అభిస్తుండడంతో స్మార్ట్‌పోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఇక సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ నిత్యం ఐదారు గంటలు స్మార్ట్‌పోన్‌లోనే ఉంటున్నారు. దీని ప్రభావం కళ్లపై, గుండెపై ఉంటుందని నిపుణులు
హెచ్చరిస్తున్నారు. పరిమితమైనే మంచిదని, అతిగా ఏది వాడినా అనర్థమే అని అంటున్నారు. ఇక తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు ఏం చేస్తున్నారో పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ వంటివి చూడటం తగ్గించి పిల్లలతో మాట్లాడటం, చిన్న ఆటలు ఆడటం చేయాలని సూచిస్తున్నారు.
అలవాటు చేసి..
పిల్లలకు చిన్నప్పటి నుంచే పేరెంట్స్ స్మార్ట్ ఫోన్ వినియోగం, అందులో వీడియోలు అలవాటు చేస్తున్నారు. దీంతో ఫోన్ చూస్తే కానీ భోజనం చేయని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక రోజులో కొంత సమయం పిల్లలకు తల్లిదండ్రులే కేటాయిస్తున్నారు. ఇది క్రమంగా అలవాటుగా మారుతోంది. ఇక గేమ్స్, వీడియోస్ అంటూ గంటల కొద్దీ పిల్లలు ఫోన్‌కే అడిక్ట్ అవుతున్నారు.
ఇలా చేయండి..
కొందరు పిల్లలు ఫోన్ ఉంటే తప్ప అన్నం తినరు. అలాంటప్పుడు ముందు ఒక ఐదు నిమిషాలు ఫోన్ లేకుండా వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. పేచీ పెట్టకుండా తింటే ఆ సమయాన్ని పెంచుకుంటూ ఫోన్ చేతికి ఇవ్వకుండా వాళ్లకు అన్నం తినిపించడం అలవాటు చేయండి.
= పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి. కూరలు ఎలా ఉన్నాయో అడగండి. కబుర్లు, చిన్నచిన్న కథలు చెబుతూ వారితో సరదాగా ఉంటే ఫోన్∙చూపించి తిండి పెట్టాల్సిన అవసరం ఉండదు.
= బాల్యం నుంచి పిల్లలను పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి. బొమ్మల పుస్తకాలు వారికి ఇవ్వడం, కథల పుస్తకాల్లోని కథలను వారికి చెప్పడం, చిన్న ఫజిల్స్ పరిష్కరించేలా చూడాలి. అప్పుడు వారి దృష్టి స్మార్ట్‌ఫోన్ వైపు మళ్లదు.
= పిల్లలను ఎప్పుడూ ఇంట్లోనే ఉంచకండి. చుట్టుపక్కల, పక్కింటి పిల్లలతో ఆటలు ఆడుకునేలా చూడండి. కాసేపు అవకాశం ఉంటే మీరే వారితో కలిసి ఆటలు ఆడండి. కాసేపు ఔట్‌డోర్ గేమ్స్, కాసేపు చెస్, క్యారమ్స్ వంటివి అలవాటు చేస్తే స్మార్ట్‌ఫోన్ వైపు ఆసక్తి చూపించరు.