Big Budget Movies : సినిమా బడ్జెట్ వల్ల సినిమా హిట్ అవుతుంది అంతే అది మన మూర్ఖత్వమే అవుతుంది. కానీ ఇప్పుడు దర్శకుల ఆలోచన మాత్రం పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్ పెడితేనే సినిమా హిట్ అవుతుంది అని అనుకుంటున్నారు చాలామంది దర్శకులు. భారీ బడ్జెట్ సినిమాలకి విడుదల ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయి భారీ ఓపెనింగ్ రావచ్చేమో కానీ, ఆ తరువాత మాత్రం ఆ బడ్జెట్ వల్ల సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే అది పెద్ద తప్పే.
ఈ మధ్య భారీ బడ్జెట్ తో విడుదలైన ఆదిపురుష్ చిత్రానికి తొలిరోజు భారీ ఓపెనింగ్స్ లభించినప్పటికీ అదే స్థాయిలో విమర్శలొచ్చాయి. హద్దుమీరిన సృజనాత్మక స్వేచ్ఛతో రామాయణ గాథను వక్రీకరించారని, దర్శకత్వం ప్రతిభ ఏమీ లేకుండా గ్రాఫిక్స్‌తో కనికట్టు చేసే ప్రయత్నం జరిగిందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు.
గ్రాఫిక్స్ మాయాజాలాన్ని అలానే భారీ బడ్జెట్ ని నమ్ముకొని రామాయణం తాలూకు ఆత్మను విస్మరించారని పలువురు ఆధ్యాత్మికవేత్తలు విమర్శించారు. 500 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం మొదటి మూడు రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించిన ఆ తరువాత మాత్రం పూర్తిగా డీలా పడిపోయింది.
ఇక ఇప్పుడు ఈ సినిమానే అనుసరిస్తూ వస్తున్నట్లు ఉంది ప్రాజెక్టు కే. ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో ఒకటి ప్రాజెక్ట్ కే. ఇక ఈ సినిమాకి ఈ మధ్యనే కల్కి 2898 AD అనే టైటిల్ పెట్టారు. అంతేకాదు పాన్ ఇండియా సినిమాలలో భారీ బడ్జెట్ తో వస్తున్న చిత్రం ఇది. ఎప్పటికప్పుడు ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచాయి. కానీ ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ఇంకా టీజర్ అంచనాలు అన్ని తగ్గించేసాయి.
ఒక రకంగా చూసుకుంటే ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ తక్కువ డబ్బులతో తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం అలానే మహానటి ఎంత బ్లాక్ బస్టర్స్ అయ్యాయో మనకి తెలుసు. మనసుకు హత్తుకునే కథలతో ఆ చిత్రాలను ఎంతో బాగా తెరకెక్కించారు. ఆ సినిమా టీజర్లు, ట్రైలర్లు కూడా అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఆ మార్క్ ప్రాజెక్టు కే లో లేదు అని అర్థం అయిపోయింది. అయితే ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కదా ఎమోషన్ ఎలా ఉంటుంది అని అడగొచ్చు. ఇక్కడ పాయింట్ ఎమోషన్ కాదు అసలు ఆ ఫస్ట్ లుక్ ఇంకా టీజర్ కేవలం బడ్జెట్ నమ్ముకొని వచ్చినట్టు ఉన్నాయి కానీ దర్శకుడు ప్రతిభను మాత్రం చూప లేదు.
రాజమౌళి ఈగ అలానే కోడి రామకృష్ణ అంజి సినిమాలు తక్కువ బడ్జెట్ లో ఎంత గ్రాఫిక్స్ పెట్టి తీశారో మనకు తెలుసు. నిజంగా గ్రాఫిక్స్ బాగా చూపించాలి అనుకున్న సినిమాలు కూడా తక్కువ బడ్జెట్ లో తీయొచ్చు. కానీ ఇప్పుడు దర్శకులు కథ లేదా గ్రాఫిక్స్ బాగుండాలి అనే దాని పైన కాకుండా బడ్జెట్ ని బట్టి సినిమా ఆరుతుందేమో అనే ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఇది ఇకనైనా మారుతుందో లేదో చూద్దాం.