శ్రీవారి భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. అదేంటంటే..?

ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి వెళ్లాలనుకునే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లను పొందే అవకాశం కల్పించింది. తిరుమల బస్ స్టేషన్ దగ్గర ఉండే ఆర్టీసీ సూపర్ వైజర్ల సహాయంతో శీఘ్రదర్శనం టికెట్లు ఉన్నవాళ్లు దర్శనం చేసుకోవచ్చు. ప్రతిరోజూ 1,000 శీఘ్రదర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని సమాచారం. Also Read: కంపెనీ వింత ఆఫర్.. వాలంటైన్స్ డే నాడు ఫ్రీగా విడాకులు..? ఏపీఎస్ ఆర్టీసీ […]

Written By: Kusuma Aggunna, Updated On : February 5, 2021 2:22 pm
Follow us on

ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి వెళ్లాలనుకునే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లను పొందే అవకాశం కల్పించింది. తిరుమల బస్ స్టేషన్ దగ్గర ఉండే ఆర్టీసీ సూపర్ వైజర్ల సహాయంతో శీఘ్రదర్శనం టికెట్లు ఉన్నవాళ్లు దర్శనం చేసుకోవచ్చు. ప్రతిరోజూ 1,000 శీఘ్రదర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని సమాచారం.

Also Read: కంపెనీ వింత ఆఫర్.. వాలంటైన్స్ డే నాడు ఫ్రీగా విడాకులు..?

ఏపీఎస్ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం ద్వారా తిరుమల వెళ్లే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఏపీఎస్ ఆర్టీసీ వైఎస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ ఠాకూర్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా తిరుపతికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సుకు చెల్లించే ఛార్జీతో పాటు 300 రూపాయలు అదనంగా చెల్లించడం ద్వారా శీఘ్రదర్శనం టికెట్లను పొందే అవకాశం ఉంటుంది.

Also Read: ఆధార్‌ కార్డులో పెళ్లి భోజనాల లిస్ట్.. అసలేం జరిగిందంటే..?

శీఘ్రదర్శనం టికెట్లు పొందిన శ్రీవారి భక్తులకు ఉదయం 11 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు అధికారులు శీఘ్రదర్శనం ఏర్పాటు చేస్తారు. ఏపీలో ప్రధాన డిపోల నుంచి తిరుపతికి బస్సులు నడుస్తున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తిరుపతికి ఏకంగా 650 బస్సు సర్వీసులను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఈవో జవహర్ రెడ్డి దూర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుపతికి చేరుకునే ప్రయాణికులు సైతం ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. శీఘ్రదర్శనం టికెట్లను తీసుకోవడం ద్వారా తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.