https://oktelugu.com/

iPhone Manufacturing : చైనాకు యాపిల్ షాక్.. ఇండియాలో ఐఫోన్ల తయారీపై కీలక నిర్ణయం

చైనా మార్నింగ్‌ పోస్ట్‌ నివేదిక నేపథ్యంలో ప్రముఖ మార్కెట్‌ రీ సెర్చ్‌ సంస్థ కౌంటర్‌ పాయింట్‌ మరో రిపోర్ట్‌ను వెలుగులోకి తెచ్చింది. 2022లో భారత్‌లో మొత్తం స్మార్ట్‌ ఫోన్‌ షిప్‌మెంట్‌ విలువలో యాపిల్‌కు 25 శాతం వాటాను కలిగి ఉందని ప్రకటించింది.

Written By:
  • Rocky
  • , Updated On : August 17, 2023 / 08:30 PM IST
    Follow us on

    iPhone manufacturing : ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న యాపిల్ ఐఫోన్లలో 85 శాతం చైనా తయారు చేస్తున్నవే. అమెరికా ఉపఖండం వెలుపల చైనాలో తయారవుతున్న ఐఫోన్లే యాపిల్ కంపెనీకి అత్యంత కీలకం. చైనాలో తక్కువ ధరకు ఫోన్లను అసెంబ్లింగ్ చేసి ఆపిల్ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇలా ఆపిల్ కంపెనీ అవసరాలను ఆసరాగా తీసుకుని చైనా ఐఫోన్ల తయారీ మీద గుత్తాధిపత్యం ప్రదర్శించడం మొదలుపెట్టింది. అయితే చైనా వ్యవహారం తనకు పంటికింద రాయి లాగా మారడంతో యాపిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.

    ఐఫోన్ల తయారీలో ప్రధాన దేశమైన చైనాకు, ఇటీవలే పుంజుకుంటున్న భారతదేశానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు యాపిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రాగన్ దేశాన్ని కాదని భారత్లో  ఐఫోన్ 15 వెర్షన్ ను భారీ ఎత్తున తయారు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రం పెరంబదూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూపులోని ప్లాంట్ లో ఈ లేటెస్ట్ ఐఫోన్లు తయారు చేయనున్నట్లు సమాచారం. చైనాలో తయారైన యాపిల్ ఉత్పత్తులు ఇతర దేశాలకు దిగుమతి చేసిన వారం రోజుల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

    యాపిల్ సంస్థ చైనాలో కొన్ని సంవత్సరాలుగా తమ ఉత్పత్తులను తయారుచేస్తోంది. అయితే డ్రాగన్ కంట్రీలో సప్లై చైన్ సమస్యలు, అమెరికా, చైనా మధ్య తగ్గిపోతున్న వ్యాపార సంబంధాలు.. ఇదే సమయంలో తయారీ కేంద్రంగా ఎదిగేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా సన్నిహిత సంబంధాలు నెరుపుతుండడంతో ఒకసారిగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో
    యాపిల్ సీఈవో టిమ్ కుక్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

    డ్రాగన్‌ దేశంలో వ్యాపారం ఎప్పటికైనా ప్రమాదమనే అంచనాకు వచ్చిన యాపిల్‌ కొన్ని సంవత్సరాలుగా తన వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు విస్తరి స్తోంది. ఇందులో భాగంగానే ఐఫోన్‌ 15 వెర్షన్‌ తయారీని ప్రారంభిం చనుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. చైనా, అమెరికా మధ్య పరిణామాల నేపథ్యం లో యాపిల్‌ భారత్‌లో ప్రయోగాత్మకంగా ఐఫోన్‌ తయారీని గతేడాది ప్రారం భించింది. భారత్‌లో తయారైన యాపిల్‌ ఐఫోన్‌ షిప్‌ మెంట్‌ విలువ 65 శాతం పెరిగింది. అంతే కాదు ఇండియాలో తయారైన ఐఫోన్‌ల విలువ ఏకంగా 162 శాతం పెరిగిందని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తెలపడం విశేషం. దీంతో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.

    ఇక చైనా మార్నింగ్‌ పోస్ట్‌ నివేదిక నేపథ్యంలో ప్రముఖ మార్కెట్‌ రీ సెర్చ్‌ సంస్థ కౌంటర్‌ పాయింట్‌ మరో రిపోర్ట్‌ను వెలుగులోకి తెచ్చింది. 2022లో భారత్‌లో మొత్తం స్మార్ట్‌ ఫోన్‌ షిప్‌మెంట్‌ విలువలో యాపిల్‌కు 25 శాతం వాటాను కలిగి ఉందని ప్రకటించింది. ఈ వృద్ధి రేటు 2021లో 12 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 85 శాతం ఐఫోన్లను చైనానే తయారు చేస్తోం ది. అయినప్పటికీ, యాపిల్‌ తన తయారీని చైనా నుంచి బయట (భారత్‌ లాంటి దేశాలు) కు తరలించాలని భావిస్తున్నందున చైనా తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.