https://oktelugu.com/

AP Politics : పాపం.. అటు బీజేపీని.. ఇటు వైసీపీని బ్లేమ్ చేశారు.. 

ఇక బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారు అయ్యిందని ఇదే టీడీపీ మీడియా కోడై కూసింది. చర్చలు పూర్తయ్యాయని బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 12 ఎమ్మెల్యే సీట్లకు ఒప్పందం కుదిరిందని టీడీపీ మీడియా హోరెత్తించింది..

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2024 / 08:11 PM IST
    Follow us on

    AP Politics : గ్లోబెల్స్ ప్రచారానికి మించి ఏపీలో రాజకీయ దుష్ప్రచారం సాగుతోంది. అవాస్తవాలు, అభూత కల్పనలతో  తప్పుడు ప్రచారం జరుగుతోంది.. ఇటీవల వైఎస్ షర్మిల వద్దకు బాబాయి వైవీ సుబ్బారెడ్డి వెళ్లారని.. రాజీ ప్రయత్నాలు చేశారని ఒక  కథనాన్ని ఓ వర్గం మీడియాలు ఘోషించాయి. అసలు నిజం ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి బయటపెట్టేసరికి ఈ మీడియా బయటపడినట్టైంది.

    అమెరికా నుంచి ఇటీవలే వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ వచ్చారు. బంధువులతో కలిసి ఆయన అమెరికా వెళ్లారు. హైదరాబాద్ లో దిగగానే జగన్ తల్లి విజయమ్మను వారంతా కలుస్తామంటే ఆయన వెళ్లి కలిశారు. కుటుంబ విషయాలు మాట్లాడుకొని ఆహ్లాదంగా గడిపారు. అక్కడ అసలు రాజకీయమే రాలేదని.. కేవలం చాలా రోజుల తర్వాత విజయమ్మను కలిసినట్టుగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో స్వయంగా చెప్పుకొచ్చారు. జగన్ తరుఫున తాను షర్మిలతో రాజకీయం చేయలేదని.. అసలు షర్మిలను కలవలేదని.. పచ్చ మీడియా ఇంత దారుణంగా రాతలు రాస్తారా? అని వైవీ సుబ్బారెడ్డి నిలదీశారు. కుటుంబ సభ్యులను కూడా బజారుకీడ్చే రాతలు రాస్తున్నారని.. ఇంతటి నీచాతి నీచమైన పరిస్థితి ఈ పచ్చమీడియా ద్వారా రావడం చాలా బాధాకరం అని వైవీ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇక బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారు అయ్యిందని ఇదే టీడీపీ మీడియా కోడై కూసింది. చర్చలు పూర్తయ్యాయని బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 12 ఎమ్మెల్యే సీట్లకు ఒప్పందం కుదిరిందని టీడీపీ మీడియా హోరెత్తించింది..

    తీరా ఈ విషయం ఆంధ్ర రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా తెలియదు.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఒప్పుకోవచ్చని అని అనుకున్నారు. ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి ఇదే విషయంపై అడగ్గా.. ‘‘అసలు టీడీపీ నేతలను తాము కలవలేదు.. ఎవరూ మా వద్దకు రాలేదు. మీ దగ్గర ప్రచారం జరిగితే మేం ఎందుకు సమాధానం చెప్తాం.. మేమైతే టీడీపీతో ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరుపలేదని బీజేపీ అధిష్టానం కుండబద్దలు కొట్టింది..’ దీంతో ఇక్కడ టీడీపీ మీడియా ఎంతలా ఇటు బీజేపీని.. అటు వైసీపీపై దుష్ప్రచారం చేస్తుందో బయటపడింది. ఈ మేరకు ఆ వీడియో వైరల్ అవుతోంది.