https://oktelugu.com/

Ambedkar Statue: నిజంగా అంబేద్కర్‌పై ప్రేమ ఎవరికి ఉంది?

రాజకీయాలకు అతీతుడైన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ అతిపెద్ద విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మహనీయుడి కీర్తి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిందని కొనియాడుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 20, 2024 / 06:32 PM IST

    Ambedkar Statue

    Follow us on

    Ambedkar Statue: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నడిబొడ్డున స్వరాజ్‌ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ఏపీ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 19న ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి సామాజిక న్యాయ శిల్పంగా నామకరణం చేశారు. అయితే అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం పార్టీలకతీతంగా అందరికీ ఆహ్వానం పంపింది. కానీ, దీనిని టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ నాయకులు బహిష్కరించారు. జనవరి 20న కూడా ఆయా పార్టీల నాయకులు అంబేద్కర్‌ విగ్రహాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. కానీ, విగ్రహావిష్కరణ రోజు ఈనాడు దిన పత్రికలో జగన్‌కు అంబేద్కర్‌ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత లేదంటూ ఒక ఫుల్‌పేజీ కథనం వండి వార్చారు. ఇది కేవలం రాజకీయ కథనం. కానీ అంబేద్కర్‌ రాజకీయాలకు అతీతం. మరణం లేని మహనీయుడు. ప్రతీ భారతీయుడు గౌరవించాలనిన గొప్ప మేధావి. భారత అతిపెద్ద రాజ్యాంగాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని గౌరవిస్తున్నాయి అంటే కారణం అంబేద్కర్‌. ఇంత గొప్ప నేత విగ్రహావిష్కరణకు పార్టీలకు అతీతంగా హాజరు కావాలి. దళితుల ప్రతినిధిగా చెప్పుకునే అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు ఆయా పార్టీల్లోని దళిత నేతలు కూడా హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

    అంబేద్కర్‌ను బహిష్కరించినట్టా?
    రాజకీయాలకు అతీతుడైన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ అతిపెద్ద విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మహనీయుడి కీర్తి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిందని కొనియాడుతున్నారు. కానీ, విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ నాయకుల హాజరు కాకపోవడం, మరుసటి రోజు కూడా అంబేద్కర్‌ విగ్రహానికి నమస్కరించకపోవడంతో అసలైన అంటరాని వారు ఎవరన్న చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. ఆ పార్టీలు అంబేద్కర్‌నే బహిష్కరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    ఆహ్వానాల పంపినా..
    విజయవాడలో ప్రతిష్టించిన 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపింది. దీంతో ప్రభుత్వం అంబేద్కర్‌ అందరి వాడు అన్నట్లుగా వ్యవహరించింది. కానీ, ఆహ్వానాలు అందుకున్న పార్టీల నేతలు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో కావాలనే హాజరు కాలేదని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. జగన్‌పై ఉన్న ద్వేషాన్ని అంబేద్కర్‌పై చూపడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    దళిత నేతలు కూడా దూరం..
    ఇక అంబేద్కర్‌ను దళితులు తమ ప్రతినిధిగా చెప్పుకుంటారు. అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగ ఫలాల ప్రకారమే వాళ్లు రాజకీయాల్లో ఎదిగారు. కానీ, ఆ మహనీయుడు ఇచ్చిన ఫలాలను అనుభవిస్తూ ఆయన అతిపెద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దళితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు తదితరులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపిణీ వారు కార్యక్రమానికి రాలేదు.

    ప్రసారానికి ఆ ఛానెళ్లు దూరం..
    ఇక ఏపీలో వైసీపీ సర్కార్‌పై నిత్యం వ్యతిరేక వార్తలు, కథనాలు ప్రసారం చేసే ఈటీవీ, టీవీ–5, ఏబీఎన్‌ చానెళ్లు విజయవాడలో ఘనంగా నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తమ ఛానెళ్లలో కనీసం ప్రసారం చేయలేదు. కేవలం జగన్‌కు మైలేజ్‌ వస్తుందన్న కారణంగానే ఆ ఛానెళ్లు కార్యక్రమాన్ని బహిష్కరించాయి. కానీ, ఇప్పుడు ఆ ఛానెళ్లు అంబేద్కర్‌నే బహిష్కరించాయన్న చర్చ ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది. దీంతో తమ నిర్ణయం భూమరాంగ్‌ అయిందన్న చర్చ ఆయా ఛానెళ్ల ప్రతినిధులే చెబుతున్నారు.

    విగ్రహం ఏర్పాటును స్వాగతించని వైనం..
    అభివృద్ధికి, నిర్మాణాలకు ప్రతినిధిగా చెప్పుకుంటారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. హైదరాబాద్‌ను నిర్మించింది తానే అని పదే పదే చెప్పుకు నేత, రాజకీయాలకు అతీతుడైన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణపై కనీసం ఒక ప్రకటన చేయలేదు. కనీసం స్వాగతించలేదు. ఆయనే కాదు ఆ పార్టీకి చెందిన వారు ఎవరూ అంబేద్కర్‌ గొప్పదనం గురించి కూడా మాట్లాడడం లేదు. జనసేన పార్టీ నుంచి కూడా ఒక్క ప్రకటన రాలేదు. ఆ పార్టీల్లో ఉన్న దళిత నాయకులు కూడా అంబేద్కర్‌ గురించి మాట్లాడకపోవడంతో ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీల్లో అంబేద్కర్‌పై వ్యతిరేకత ఉందని, వారంతా అంబేద్కర్‌ను వ్యతిరేకిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    ‘అంబేద్కర్ అందరివాడు.. దళితుల ప్రతినిధి. ఇదొక ప్రభుత్వ కార్యక్రమం.. జగన్ ఈరోజు ఉంటాడు.. రేపు అధికారంలోంచి పోతాడు. కానీ దళితులు, దళిత నేతలు, వారి మనోభావాలు అన్నవి ముఖ్యం. చంద్రబాబు ఇందులో రాజకీయం వదిలేసి జగన్ పిలుపునకు వస్తే బాగుండు. ఇక జగన్‌కు క్రెడిట్ వస్తుందని ఆయన రాలేదు. పోనీ జగన్ సైతం దీన్ని తన రాజకీయాలకు వాడకుండా అందరినీ కలుపుకుపోయినా బాగుండు.. కేవలం తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అని దళితుల్లో మైలేజ్ కోసం అర్రులు చాచాడు.

    మొత్తంగా అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షం రెండూ కూడా ‘అంబేద్కర్’ చుట్టూ రాజకీయం నడిపాయే కానీ.. ఆయన ఆశయాలు, దళితుల అభ్యున్నతిని కోసం ఆలోచించకపోవడం శోచనీయం