https://oktelugu.com/

Prabhas – Anushka : త్వరలోనే ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న అనుష్క – ప్రభాస్

ఇక ఆదిపురుష్ సినిమా దగ్గర నుంచి ప్రభాస్ కృతి సనన్ మధ్య ప్రేమ అంటూ రూమర్ రావడంతో, ఇక అనుష్క, ప్రభాస్ చాప్టర్ ముగిసినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఇద్దరూ తమ అభిమానులకు ఒక శుభవార్త చెప్పబోతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 30, 2023 / 02:49 PM IST
    Follow us on

    Prabhas – Anushka : ఆన్ స్క్రీన్ పైర్స్ లో అనుష్క – ప్రభాస్ కి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైట్ లో కానీ వెయిట్ లో కానీ జోడీలో కానీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు. దానికి తోడు వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు అన్నీ మంచి హిట్లుగా మిగిలాయి.

    ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మిర్చి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఆ తరువాత వచ్చిన బాహుబలి అయితే పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించింది. వరస పెట్టి వీరిద్దరూ సినిమాలలో కనిపించడంతో అలానే ఫంక్షన్స్ లో కూడా మంచి ఫ్రెండ్స్ గా ఒకరితో ఒకరు ముచ్చట్లు ఆడుతూ ఉండడంతో, అందరూ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అనుకున్నారు. కానీ అది జరగలేదు. వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది అని ఎన్ని రూమర్స్ వచ్చిన వీరిద్దరూ మాత్రం ఆ విషయం గురించి స్పందించలేదు.

    ఇక ఆదిపురుష్ సినిమా దగ్గర నుంచి ప్రభాస్ కృతి సనన్ మధ్య ప్రేమ అంటూ రూమర్ రావడంతో, ఇక అనుష్క, ప్రభాస్ చాప్టర్ ముగిసినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఇద్దరూ తమ అభిమానులకు ఒక శుభవార్త చెప్పబోతున్నారు.

    అదేమిటి అంటే సినీ వర్గాల సమాచారం ప్రకారం.. వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తుందని టాక్. అసలు విషయానికి వస్తే.. సినిమాలకు అనుష్క గుడ్ బాయ్ చెప్పాలి అనుకుందట. అయితే ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు మారుతి.. ప్రభాస్‌‌‌తో తను తీసే మూవీలో నటించాలని అడిగారట. అందులో ఆమెను హీరోయిన్‌‌గా కాకుండా ఒక ముఖ్య పాత్రలో తీసుకుంటారట. అందుకు అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమచారం.

    ఇంకా ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రాలేదు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ – అనుష్క కాంబోలో మరో పీరియాడికల్ తీసేందుకు డైరెక్టర్ క్రిష్ ఓ కథను రెడీ చేశారట. వీరిద్దరికీ తన కథ కూడా వినిపించారని.. ఆ కథ ఇద్దరికీ నచ్చింది అని కూడా తెలుస్తోంది. ఇదే నిజమైతే మరోసారి బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ – అనుష్కను చూడొచ్చు. ఇక నిజంగా ఈ రెండు వార్తలు నిజమైతే వీరిద్దరి అభిమానులు తెగ ఖుషి అయిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.