ante sundaraniki movie twitter review telugu నేచురల్ స్టార్ నటించిన ‘అంటే సుందరానికి..’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. బిగ్ హీరోలతో పోటీ పడుతూ నాని చేస్తున్న సినిమాలపై అభిమానుల అంచనాలు సినిమా సినిమాకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో నాని డిఫరెంట్ లుక్లో కనిపించడంతో ‘అంటే సుందరానికి..’పై ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే సినిమా రిలీజ్ అయిన తరువాత కొందరు ట్విట్టర్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు సినిమాను మెచ్చుకుంటుండగా.. మరికొందరు మాత్రం బాగా లేదని పెడుతున్నారు. మొత్తంగా నాని సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తుందని తెలుస్తోంది.

సినిమా కథ విషయానికొస్తే బ్రాహ్మణ కులానికి చెందిన నాని క్రిస్టియన్ మతం అమ్మాయి ప్రేమలో పడుతాడు. అయితే ఈ పెళ్లిని పెద్దలు ఒప్పుకోకపోవుడంతో నాని చిక్కుల్లో పడతాడు. ఆ సమస్యే సినిమాకు ప్రధాన అంశంగా మారనుంది. ఇందులో నానికి ఓ సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య నుంచి బయటపడడానికి తంటాలు పడుతుంటాడు. ఇందులో కాస్త కామెడీని మిక్స్ చేశారు. సాధారణంగా అన్ని భావాలు చూపించే నాని కామెడీతో కూడా ఆకట్టుకున్నారు. రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నానికి జోడీగా నజ్రియ నజీమ్ జంటగా నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది.
#Vikram knchm baundi … migatadi goppa ga ledu + ardm kaledu
— moving on (@JakDexxter) June 5, 2022
ఇక సినిమాకు ఫస్టాప్ ప్లస్ పాయింట్ గా మారనుంది. అయితే అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. పాత్రలను పరిచయడం చేయడానికి కాస్త నిడివి ఎక్కువగా తీసుకున్నాడు దర్శకుడు. ఇక సెకండాఫ్ మొత్తం కామెడీతోనే నిండిపోయింది. ఇందులో మధ్య మధ్యలో ఎమోషన్స్ సీన్స్ అటాచ్డ్ చేసినా కామెడీ ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా సినిమాను సాగతీయడంతో కాస్త బోర్ కూడా కొడుతుంది. ఇక హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్ పండించినా..పాటలు ఆకట్టుకోలేకపోయాయి. ఎమోషన్స్ కోసం కష్టపడినా ప్రేక్షకులను డీప్ గా తీసుకెళ్లలేకపోయారు. ఇవి సినిమాకు మైనస్ గా మారాయి.
#AnteSundaraniki A Classy Romantic Comedy that is both Entertaining and Emotional!
The movie is engaging even though it feels lengthy at times and comedy is natural. The emotions worked well. Nani, Nazriya, and the rest of the cast was perfect.
Go for it 👍
Rating: 3.25/5
— Venky Reviews (@venkyreviews) June 9, 2022
నాచురల్ స్టార్ నాని సినిమాలో హీరోకే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇందులో కూడా హీరో ఓరియెంటెడ్ గానే సినిమా ముందకు వెళ్తుంది. నాని నటకు మంచి మార్కులు పడ్డాయి. అయితే మిగతా యాక్టర్లు నానిని బీట్ చేయలేకపోయారు. నజ్రియా మాత్రం తన నటనతో ఆకట్టుకుంది. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాకు ట్విట్టర్ వాయిస్ పరిశీలిస్తే మిక్స్ డ్ టాక్ రావొచ్చని అంటున్నారు.
https://twitter.com/SimiValleydude/status/1535071587312885761?s=20&t=An62UJun07sE1BL5PWyPMQ
‘అంటే సుందరానికి..’ నైజాంలో ఇప్పటికే రూ.10 కోట్లు, సీడెడ్లో రూ.4 కోట్లు, అంధ్రాలో రూ.10 కోట్లు మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.24 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే రెస్టాఫ్ ఇండియాలో రూ.3.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ.2.50 కోట్లు కలిసి మొత్తం రూ.30 కోట్ల వరకు అమ్ముడుపోయింది.
Peddaga story, logic, clarity, conflict em lekpoyina…. siddhu one-man show kosm onetime easy watch …
Heroine ni ba eskunadu siddu boi 🤣 #DJTillu— sambar (@JakDexxter) February 12, 2022


