Annamalai Padayatra : ఓ పండుగలాగా కొనసాగుతున్న అన్నామలై పాదయాత్ర

ఎంజీఆర్ తర్వాత జయలలిత కూడా ఇంతలా ప్రజలతో కనెక్ట్ కాలేదు. ఆమెకు ఉన్న పరిమితులు అలాంటివి. కానీ ఇప్పుడు అంతకుమించిన జనాదరణ ఇప్పుడు అన్నామలైకు దక్కుతుంది.

Written By: NARESH, Updated On : August 19, 2023 2:44 pm

Annamalai Padayatra : అన్నామలై పాదయాత్ర ఓ పండుగలా సాగుతోంది. జనసమూహం విపరీతంగా వస్తున్నారు. వృద్ధులు, మహిళలు, యువకులు , ప్రజలు విపరీతంగా వస్తున్నారు. అన్నామలై తోటి కలిసి నడవాలని.. సెల్ఫీలు దిగాలని.. ఆప్యాయత చాటుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఎంజీఆర్ తర్వాత తమిళనాడులో ఈ విధంగా జనాలతో కనెక్ట్ అయిన నాయకుడు మరొకరు లేరు.

ఎంజీఆర్ తర్వాత జయలలిత కూడా ఇంతలా ప్రజలతో కనెక్ట్ కాలేదు. ఆమెకు ఉన్న పరిమితులు అలాంటివి. కానీ ఇప్పుడు అంతకుమించిన జనాదరణ ఇప్పుడు అన్నామలైకు దక్కుతుంది.

పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే డీఎంకే మీద ఇంతటి ప్రభుత్వ వ్యతిరేకత ఉందా? అని డౌట్ కొడుతోంది. డీఎంకే అవినీతిపై బోలెడు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతీ మంత్రిపై వేలాది కోట్లు దోచుకున్నాడని మండిపడుతున్నారు. జనంలో ఆల్టర్ నేట్ లేక డీఎంకేకు ఓటు వేశారు తప్పితే ప్రేమతో కాదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కలిసి పోటీచేస్తే డీఎంకేకు షాక్ తప్పదు.

పోయిన సారి 2019 లోక్ సభ ఎన్నికల్లో 39 లోక్ సభ సీట్లకు 38 ఎంపీ సీట్లను డీఎంకే గెలిచింది. నాడు మోడీ ఓడిపోతాడని.. కాంగ్రెస్ గెలుస్తుందని స్టాలిన్ చేసిన ప్రచారం నమ్మి జనాలు కాంగ్రెస్ కూటమి కట్టిన డీఎంకేను గెలిపించారు. కానీ ఈసారి దేశంలో మరోసారి మోడీ గెలుస్తాడని స్పష్టమైన ఆధిక్యత, ఆలోచన ఉండడంతో అన్నామలై నేతృత్వంలోని ఎన్డీఏకు తమిళనాడులో గెలుపు అవకాశాలు ఉండనున్నాయి.

అన్నామలై పాదయాత్ర పరిణామాలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.