Animal Censor Review: యానిమల్ మూవీ సెన్సార్ రివ్యూ… వైలెన్స్ లో నెక్స్ట్ లెవెల్, ఆ సీన్స్ కి గూస్ బంప్స్

అర్జున్ రెడ్డి చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి మరో భారీ హిట్ కొట్టాడు. అక్కడ కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ మూవీ యానిమల్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.

Written By: Neelambaram, Updated On : November 27, 2023 11:48 am

Animal

Follow us on

Animal Censor Review: సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి మూవీతో ట్రెండ్ సెట్ చేశాడు. హీరోయిజం, ఎమోషన్స్ ఎలివేషన్ లో నెక్స్ట్ లెవల్ పరిచయం చేశాడు. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ కాగా అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా ప్రేయసి పట్ల ప్రియుడు వ్యవహరించిన తీరు బాగోలేదు. ఆడవాళ్ళ మీద హింసా ప్రవృత్తిని ఎంకరేజ్ చేసేలా ఉందన్న వాదనలు వినిపించాయి. అలాగే అర్జున్ రెడ్డి మూవీలో వాడిన కొన్ని బూతు పదాలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

అర్జున్ రెడ్డి చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి మరో భారీ హిట్ కొట్టాడు. అక్కడ కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ మూవీ యానిమల్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ యానిమల్ కూడా కాంట్రవర్సీకి వేదిక కానుందా అంటే… మరింత కాంట్రవర్సీ క్రియేట్ చేయవచ్చని సందీప్ రెడ్డి వంగా అన్నారు. యానిమల్ ట్రైలర్ చూశాక నిజంగానే సందీప్ రెడ్డి సంచలనానికి తెరలేపాడనే వాదన మొదలైంది.

రొమాన్స్, వైలెన్స్, ఎమోషన్స్ నెక్స్ట్ లవ్ లో చూపించే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది. యానిమల్ చిత్రంపై సెన్సార్ సభ్యులు ఎలా స్పందిస్తారు. ఏం సర్టిఫికెట్ ఇస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యానిమల్ మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీలో వైలెన్స్, రొమాన్స్, అబ్యూస్ వర్డ్స్ ఉన్న నేపథ్యంలో ఓన్లీ ఫర్ అడల్ట్ మూవీగా సర్టిఫై చేశారు.

సెన్సార్ సభ్యుల రివ్యూ ప్రకారం మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. వైలెన్స్ ఊహకు మించి ఉంటుంది. గతంలో ఎన్నడూ చూడని బ్లడ్ బాత్ తో కూడిన సన్నివేశాలు గూస్ బంప్స్ కలిగిస్తాయి. ఇది రివేంజ్ డ్రామా. తండ్రిని చంపిన వాళ్ళ మీద హీరో రివేంజ్ తీర్చుకుంటాడు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ ని కొత్తగా చూపించారని అంటున్నారు. మొత్తంగా యానిమల్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందని అంటున్నారు.