https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజ్యాధికార నినాదం కేంద్రంగా ఒక్కటవుతున్న ఆంధ్రా కాపులు

పవన్ కళ్యాణ్ రాజ్యాధికార నినాదం కేంద్రంగా ఒక్కటవుతున్న ఆంధ్రా కాపుల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : January 12, 2024 / 12:34 PM IST

    Pawan Kalyan : గత రెండు రోజుల నుంచి ఆంధ్రా రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న ప్రసిద్ధ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ ను కలవడం సంచలనమైంది. నిన్నటికి నిన్న కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం.. వైసీపీలో చేరకుండా జనసేనలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు ఆంధ్ర రాజకీయాలను షేక్ చేశాయి.

    సామాజికపరంగా ఆంధ్రాలో కాపు సామాజికవర్గం 20 శాతం వరకూ ఉంది. సంఖ్యా పరంగా అత్యధికంగా బలంగా ఉన్న సామాజిక వర్గం. కాకపోతే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వీరికి అధికారం అందని ద్రాక్షలాగానే ఉంది. మనకు ఇంత సంఖ్యా బలం ఉండి అధికారంలోకి రాకపోవడం అన్న ఆవేదన కాపుల్లో ఉంది.

    2009లో కాపుల కోసం పార్టీ పెట్టిన ప్రజారాజ్యం 50 శాతం బీసీలకు టికెట్లు ఇచ్చినా అది వర్కవుట్ కాలేదు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనంతో మరోసారి కాపులంతా ఆగమయ్యారు.కోలుకోవడానికి దశాబ్ధం పట్టింది. 2014లో జనసేనను పవన్ పెట్టినా కాపులు ఆయన వెంట రాలేదు. 2019లో పవన్ ఓడిపోయిన తర్వాత తిరిగి నిలబడ్డాడు. ఓడిపోయినా వదిలిపెట్టని పవన్ తీరుతో కాపులంతా మేల్కొని ఆయన వెంట నడవడం ప్రారంభించారు. ఇప్పటం మహాసభతో మొదలైన కాపుల ఏకీకరణకు బీజం పడింది. సభలు, సమావేశాలతో కాపుల్లో నమ్మకం కలిగించారు.

    పవన్ కళ్యాణ్ రాజ్యాధికార నినాదం కేంద్రంగా ఒక్కటవుతున్న ఆంధ్రా కాపుల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.