https://oktelugu.com/

TTD Board Members : ఆర్థిక నేరగాళ్లతో నిండిపోయిన టీటీడీ బోర్డు

రెండుసార్లు అవినీతి ఆరోపణలతోనే జైలు జీవితం అనుభవించారు. ఇప్పుడు హఠాత్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో చోటు దక్కించుకున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 27, 2023 / 10:56 AM IST
    Follow us on

    TTD Board Members : టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం వివాదాస్పదమవుతోంది. బోర్డులో ఆర్థిక నేరస్తులకు చోటు కల్పించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో తనకు పనికొచ్చారని.. వచ్చే ఎన్నికల్లో పనికొస్తారని.. ఇలా రకరకాల వ్యూహాలతో జగన్ టీటీడీ పాలకమండలి సభ్యులను నియమించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో తీహార్ జైలు నుంచి నేరుగా టీటీడీ బోర్డులోకి వచ్చేశారు పెనాక శరత్ చంద్రారెడ్డి. అరబిందో గ్రూప్ వారసుడు ఈయన. వైసీపీ కీలక నేత విజయ్ సాయి రెడ్డి అల్లుడు సోదరుడు.శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాం లో నిందితుడు. ఈజీ మనీ కోసం స్కాంలోకి దిగాడు. బయటపడడం కోసం జగన్ రెడ్డి చేసిన లాబీయింగ్ లో భాగంగా అప్రూవర్ గా మారాడు. బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా టీటీడీ బోర్డు మెంబర్ గా ఎంపిక అయ్యాడు.

    మరో ఇద్దరి నియామకంపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి. కేతన్ దేశాయ్ అనే మరో వ్యక్తిని కూడా సభ్యుడిగా నియమించారు. ఆయన భారత వైద్య మండలికి చైర్మన్గా వ్యవహరించారు. దేశంలో వైద్య విద్యను సంస్కరించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కానీ ఓ కాలేజీ అనుమతికి ఏకంగా రెండు కోట్లు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పదవులు సైతం పోగొట్టుకున్నారు. రెండుసార్లు అవినీతి ఆరోపణలతోనే జైలు జీవితం అనుభవించారు. ఇప్పుడు హఠాత్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో చోటు దక్కించుకున్నారు.

    మరోవైపు కృష్ణమూర్తి వైద్యనాథన్ అనే తమిళనాడు వ్యక్తికి ఆరోసారి టీటీడీ పాలకమండలి సభ్యుడుగా అవకాశమిచ్చారు. దీని చుట్టూ కూడా చర్చ నడుస్తోంది. తమిళనాడుకు చెందిన ఆడిటర్ అయిన కృష్ణమూర్తి 2015లో తొలిసారిగా టీటీడీ పాలక మండలి సభ్యుడుగా నియమితులయ్యారు. 2018 లో మాత్రం ఆయనకు చోటు దక్కలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సభ్యుడిగా మళ్లీ ప్రవేశించారు. ఇప్పటివరకు ఆరుసార్లు సభ్యుడిగా కొనసాగుతున్నారు. కేంద్రంలోని ఓ కీలక నేత సిఫార్సులతోనే ఆయన నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి.