Anasuya Walks Out Of Jabardasth: బుల్లితెరపై కామెడీతో ఊర్రూతలూగించే షో ‘జబర్దస్త్’. చాలా మంది ఈ షో ను ఎపిసోడ్ మిస్సవకుండా చూస్తారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి నటులు.. రష్మీ, అనసూయ యాంకర్లు కలిసి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లు విభిన్న స్కిట్లు చేసి మిగతా వారి కంటే ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే జబర్దస్త్ నుంచి వీరు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మొన్న సుడిగాలి సుధీర్, నిన్న హైపర్ ఆది.. తాజాగా అనసూయ లు తమకు జీవితాన్ని ప్రసాదించిన జబర్దస్త్ ను విడిచిపెడుతున్నారు. అయితే వీరు ఇంతకాలం సినిమాల్లో అవకాశాలు వచ్చినా షో ను మాత్రం వీడలేదు. కానీ ఇప్పుడు ప్రొగ్రాం నుంచి మొత్తం బయటకు రావడంపై జోరుగా చర్చ సాగుతోంది. వీరికి ఇతర అవకాశాలు వచ్చి వెళ్లిపోతున్నారా..? లేక కావాలనే పంపుతున్నారా..? అని ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు.

ఎంతో కాలంగా.. ఎన్నో ఆఫర్లు వచ్చినా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ను వీడలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే డిఫరెంట్ స్కిట్లు చేస్తూ జబర్దస్త్ లో మెరిశారు. మరి వీరు షో ను ఎందుకు వదులుకుంటున్నారు..? అని అందరూ ఆరాతీస్తున్నారు. పారితోషికం విషయంలో మల్లెమాల యాజమాన్యంతో విభేదాలు వచ్చాయని కొందరు అంటున్నారు. ఎంతోకాలంగా తాము ఈ షో చేస్తున్నామని, అందుకే పారితోషికం పెంచాలని సీనియర్ నటులు కోరారట. అయితే నిర్వాహకులు మాత్రం కొత్తవారినైనా తీసుకుంటామని.. రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చేది లేదని తేగెసి చెప్పారట. దీంతో ప్రముఖ నటులంతా జబర్దస్త్ ను వీడుతున్నట్టు ఇన్ సైడ్ టాక్.
పంచ్ లకు మారు పేరు హైపర్ ఆది. ఆయన పంచ్ లేనిదే బజర్దస్త్ షో చూడలేం. ప్రతీ ఎపిసోడ్ లో హైపర్ ఆది స్కిట్ కోసం ఎదురుచూసేవాళ్లే ఎంతో మంది ఉన్నారు. ఆయన స్టేజీ పైకి రాగానే పంచ్ ల వర్షం కురుస్తుంది. మరోవైపు సుడిగాలి సుధీర్ ఫర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. రష్మితో ఆయన చేసే రొమాన్స్ మరింత బూస్ట్ నిస్తుంది. వీరిద్దరు కలిసి చేసే స్కిట్ కు యూత్ ఫిదా అవుతారు. అలాంటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది, సుధీర్ లు జబర్దస్త్ ను వీడారు.

తాజాగా అనసూయ సైతం జబర్దస్త్ ను వీడేందుకు రెడీ అయ్యారు. అనసూయను ఫుల్ టైం కాకుండా పార్ట్ టైంలోనైనా జబర్దస్త్ లో మెరిసేది. కానీ ఇప్పుడు పూర్తిగా వీడనున్నట్లు సమాచారం. అనసూయ సైతం పారితోషికం విషయంలోనే నొచ్చుకొని బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం సినిమాల్లో అవకాశాల కోసమేనని అంటున్నారు. ఇప్పటి వరకు అనసూయ సినిమాల్లో నటిస్తున్నా జబర్దస్త్ లో కనిపించారు. అప్పుడు వీడని అనసూయ లెటేస్టుగా షో ను వదులకోవడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో జడ్జిగా ఉన్న నాగబాబు ‘జీ తెలుగు’ అదిరింది షో కు వెళ్లారు. ఆ సమయంలో హైపర్ ఆది, సుధీర్ లకు ఆఫర్లు వచ్చాయి. అయినా వీరు షో ను వదలలేదు. కానీ ఇప్పుడు రకరకాల కారణాలు చెప్పి ఇందులో నుంచి బయటకు వస్తున్నారు. కొందరు వీరికి ఇతర అవకాశాలు వచ్చి వెళ్తున్నారని అంటున్నారు.. మరికొందరు మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో తేడా కొట్టి వీరిని బయటకు పంపుతున్నారని చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా గత జబర్దస్త్ షో కు ఇప్పటి షో కు చాలా తేడా ఉందని చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికైనా ఉన్న కొందరు సీనియర్ కమెడియన్స్ ను అయినా వెళ్లిపోకుండా కాపాడుకోవాలని జబర్దస్త్ చూసేవాళ్లు కోరుతున్నారు.
Also Read:Sreemukhi: సిమ్మింగ్ పూల్ లో యాంకర్ శ్రీముఖి… తడిసిన అందాలకు పూలను అడ్డుగా పెట్టి
Recommended Videos