https://oktelugu.com/

Anasuya Bharadwaj : దూల తీర్చేస్తా.. మళ్లీ రెచ్చిపోయిన అనసూయ.. వైరల్ వీడియో…

ఇక ఈ సంవత్సరం కూడా తన జోలికి ఎవరిని అయిన దూల తీర్చి ధూపం వేస్తా అంటూ బూతులతో రెచ్చిపోయింది. ఇక ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక 2023 వ సంవత్సరంలో ఆమె రంగమార్తాండ, విమానం, పెదకాపు లాంటి సినిమాల్లో నటించి మంచి సక్సెస్ లు సాధించింది.

Written By:
  • NARESH
  • , Updated On : January 1, 2024 / 09:41 AM IST
    Follow us on

    Anasuya Bharadwaj : బుల్లితెరపై తనదైన రీతిలో యాంకరింగ్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న అనసూయ జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక అందులో భాగంగానే ఆమె సంపాదించుకున్న ఇమేజ్ తో ఆమెకి వరుసగా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా ఆమె నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాలో నటించింది. దాంతో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది.

    ఇక సినీ కెరియర్ పరంగా ఆమె చాలా సంతృప్తిగా ఉన్నప్పటికీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ ఎప్పుడు ప్రేక్షకుల నుంచి విమర్శలను ఎదుర్కొంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టిివ్ గా ఉంటు ట్రోల్స్ కు గురైన కూడా తన బిహేవియర్ ను మాత్రం మార్చుకోకుండా తనకు అనిపించింది మాట్లాడుతూ ట్రోల్ చేసే వారి పైన భారీగా విరుచుకుపడుతుంది. ఈమె ముఖ్యంగా విజయ్ దేవరకొండ ని ఉద్దేశిస్తూ చాలా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. దాంతో అతని ఫాన్స్ తన మీద సీరియస్ అవుతూ ట్రోల్ చేస్తూ ఉంటారు.

    ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ చేసిన ఖుషి సినిమా పట్ల కూడా ఆమె కొన్ని కామెంట్లు అయితే చేసింది విజయ్ దేవరకొండ తన పేరుకి ముందు ది విజయ్ దేవరకొండ అనేది పెట్టుకోవడం కరెక్ట్ కాదు అంటూ అతని మీద కొన్ని విమర్శలను కూడా చేసింది. దాంతో అతని ఫాన్స్ ఈమెని సోషల్ మీడియా వేదికగా ఒక ఆట ఆడుకున్నారు అయినప్పటికీ తను కొంచెం కూడా తగ్గకుండా తను కూడా వాళ్లకు కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేసింది. ఇక దాంతో తన మీద ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ల మీద కేసులను కూడా పెట్టింది. ఇక ఇప్పుడు 2023 వ సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సమయాన ఆమె ఒక వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది అదేంటి అంటే 2023 సంవత్సరంలో తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడు ఉంటే పర్లేదు.

    ఇక ఈ సంవత్సరం కూడా తన జోలికి ఎవరిని అయిన దూల తీర్చి ధూపం వేస్తా అంటూ బూతులతో రెచ్చిపోయింది. ఇక ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక 2023 వ సంవత్సరంలో ఆమె రంగమార్తాండ, విమానం, పెదకాపు లాంటి సినిమాల్లో నటించి మంచి సక్సెస్ లు సాధించింది.