https://oktelugu.com/

Anant Ambani : డబ్బుకే ఈ లోకం దాసోహం.. పెళ్లి వేడుకలో తమ్ముడు అనిల్ అంబానీ పరిస్థితిదీ

అనిల్ అంబానీ, తన కుటుంబంతో జామ్ నగర్ లోని వేడుకల ప్రాంతానికి ఓ సాధారణ వ్యక్తి లాగా వచ్చాడు. అతడు వేసుకున్న డ్రెస్ కూడా అంత హుందాగా లేదు. ఫోటోలు తీయడానికి కూడా అక్కడి ఫోటోగ్రాఫర్లు అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 4, 2024 / 10:05 AM IST
    Follow us on

    Anant Ambani : ధనం మూలం ఇదం జగత్.. అంటే డబ్బు చుట్టే ఈ లోకం పరిభ్రమిస్తుందని అర్థం. అందుకే డబ్బుంటేనే ఈ సమాజం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, వంగి వంగి దండాలు పెడుతుంది. అదే డబ్బు లేకుంటే “నిన్ను ఎక్కడో చూసినట్టుంది అన్నట్టుగా” ప్రవర్తిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ముకేశ్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి అనుబంధాలకు, ఆప్యాయతలకు మేము ప్రాధాన్యమిస్తామని ముఖేష్ కుటుంబం పదేపదే చెప్తుంటుంది.. కానీ అనిల్ విషయంలో ఎందుకు ప్రదర్శించలేకపోయిందనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

    జామ్ నగర్ లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఎక్కడెక్కడ నుంచో అతిరథ మహారధులు వచ్చారు. ఆ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే చాలామందికి ఆ వేడుకల్లో అనిల్ అంబానీ కుటుంబం కనిపించకపోవడం తో.. ముఖేష్ కుటుంబంతో గ్యాప్ ఉందనుకున్నారు. అయితే అనిల్ అంబానీ కుటుంబం ఆ వేడుకల ప్రాంగణంలో కనిపించడం అందరి అనుమానాలను పటా పంచలు చేసింది. కానీ ఇదే సమయంలో అనిల్ అంబానీ తన కుటుంబంతో అక్కడికి వచ్చిన తీరు చివుక్కుమనేలా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఇద్దరన్నదమ్ములు చెరి సమానంగా ఆస్తులు పంచుకున్నారు. ఒకానొక దశలో అనిల్ ముఖేష్ ను మించి పోతాడనుకున్నారు. కానీ అనూహ్య రీతిలో కిందికి పడిపోయాడు. నష్టాలు ముమ్మరమయ్యాయి. ఆస్తులు అమ్మాల్సి వచ్చింది. ఫలితంగా వేలకోట్లకు అధిపతిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా వందల కోట్లకు వచ్చాడు. గౌరవం తగ్గిపోయింది. అంబానీ అనే విలువ పడిపోయింది. సీన్ కట్ చేస్తే అనామకంగా, తన లగేజీ తనే పట్టుకొని అన్న ఇంటికి రావాల్సి వచ్చింది.

    అనిల్ అంబానీ, తన కుటుంబంతో జామ్ నగర్ లోని వేడుకల ప్రాంతానికి ఓ సాధారణ వ్యక్తి లాగా వచ్చాడు. అతడు వేసుకున్న డ్రెస్ కూడా అంత హుందాగా లేదు. ఫోటోలు తీయడానికి కూడా అక్కడి ఫోటోగ్రాఫర్లు అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. ముఖంలో నిర్వేదం, కళ్ళల్లో బాధ, గుండెల్లో అదిమి పట్టుకోలేనంత దుఃఖం అవన్నీ అనిల్ లో కనిపించాయి. అందుకే అంటారు డబ్బుంటేనే పేరు, ప్రఖ్యాతలు, డబ్బు ఉంటేనే దర్పం, డబ్బు ఉంటేనే మర్యాదలు.. ఇది అనిల్ కు అర్థమైంది. అతడికి అర్థమయ్యే లోపలనే డబ్బు మొత్తం కరిగిపోయింది.. ఇద్దరన్నదమ్ములు రిలయన్స్ విస్తరణలో ఒకప్పుడు కీలకపాత్ర పోషించారు. సీన్ కట్ చేస్తే ఒకరేమో ఇండియాలో నెంబర్ వన్ రిచెస్ట్ మాన్ గా అవతరించారు.. మరొకరేమో ఆస్తులన్నీ పోగొట్టుకొని అప్పుల్లో మునిగిపోయారు.. దీనినే విధి వైచిత్రి అంటారేమో..