Anand Mahindra Monday motivation : “నిర్మాణరంగంలోని కార్మికులకు సోమవారం ఇలా మొదలవుతుంది. నా పనిలో ఏదైనా సవాల్ అనిపించినప్పుడు నేను వారిని చూస్తా” అని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతా లో ఓ వీడియోను పోస్ట్ చేసి.. పై విధంగా రాసు కొచ్చారు. దానికి #Monday motivation అనే యాష్ ట్యాగ్ జత చేశారు.. ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ” పని చేయడం అనేది గొప్ప కళ అని.. మీరు చేస్తున్న పనిలో సవాళ్లు ఎదురైనప్పుడు నిర్మాణ రంగంలో కార్మికులను చూస్తా ఉంటారు. వారి ద్వారా మరింత ప్రేరణ పొందుతారు. ఇలా ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. అది మీలో చాలా ఉందని” ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు..”మీరు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి కార్మికుల వల్లే మీరు ప్రేరణ పొందుతున్నారు. ఆ విషయాన్ని మీరు నేరుగా ఒప్పుకున్నారు. శ్రమను గుర్తించడం అంటే మామూలు విషయం కాదు” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది.
మనదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తగా ఆనంద్ మహీంద్రా పేరు సంపాదించుకున్నారు. వాహనాలు, తయారీ యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు, ఏరోస్పేస్, టెక్నాలజీ వంటి రంగాలలో ఆనంద్ మహీంద్రా దూసుకుపోతున్నారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వేలకోట్ల సంస్థలకు అధిపతిగా ఉన్నారు. అయినప్పటికీ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాలలో చాలా చురుకుగా ఉంటారు. తనకు నచ్చిన విషయాలను పంచుకుంటారు. తనకు ప్రేరణ కలిగించిన వ్యక్తులను పరిచయం చేస్తుంటారు. ట్విట్టర్ ఎక్స్ లో ఆనంద్ మహీంద్రా ను 11 మిలియన్ల నెటిజెన్లు అనుసరిస్తున్నారు.
ఆనంద్ మహీంద్రా పేరు మోసిన వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా.. దాతృత్వ పరంగానూ మంచి పేరు సంపాదించుకున్నారు. దేశంలో ఔత్సాహిక క్రీడాకారులకు ఆయన తన మహేంద్ర సంస్థ తయారుచేసిన థార్ వాహనాలను బహుకరిస్తూ ఉంటారు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం లోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫ రాజ్ నేపథ్యం తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా.. చలించి పోయారు. సర్ఫ రాజ్ ఎంట్రీ వెనుక ఆయన తండ్రి నౌషద్ ఖాన్ కష్టాన్ని స్వయంగా తెలుసుకొని.. అతడికి మహీంద్రా థార్ వాహనం అందిస్తానని ప్రకటించారు. గతంలో చాలామంది ఆటగాళ్లకు ఆయన ఇదే విధంగా తన సంస్థ తయారు చేసిన వాహనాలను బహుకరించారు.
This is what a construction worker’s Monday morning is like.
I look at this whenever I feel MY work is too challenging… #MondayMotivation pic.twitter.com/zA6gEdT2Ab
— anand mahindra (@anandmahindra) February 26, 2024